Breaking News

జంక్‌ ఫుడ్‌ వినియోగం వల్ల అనారోగ్య సమస్యలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళా శిశు సంక్షేమ శాఖ వారి ఆద్వర్యంలో పోషణ మాసం సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సెమినార్‌ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా విధ్యార్థులకు రక్తహీనత నివారణ, కౌమారదశలో పోషకాహారం యొక్క ప్రాముఖ్యత, జంక్‌ ఫుడ్‌ వినియోగం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు గురించి ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పీడీ రాదమ్ము వివరించారు.

అలాగే సేంద్రియ ఎరువుల వాడకం, కిచెన్‌ గార్డెనింగ్‌ గురించి రిలైన్స్‌ ఫౌండేషాన్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ రాజు వివరించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఫాషన్‌ అభియాన్‌ డిస్ట్రిక్ట్‌ కో ఆర్డినేటర్‌ స్వరూప, డిపిఏ నరేష్‌, సూపర్‌ వైసర్‌ నరసమ్మ, అంగన్‌వాడి టీచర్లు, సఖి సెంటర్‌ ప్రతినిది రోజా, కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రకాంత్‌, లెక్చరర్లు, విద్యార్దులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *