ప్రజల మధ్య ఉండడమే నా ధ్యేయం

రెంజల్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవి లేనప్పుడే ప్రజల మధ్య ఉన్న పదవులు శాశ్వతం కాదు, ప్రజలే శాశ్వతం అని జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌ రావ్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపెట్టిన ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా రెంజల్‌ మండలంలోని కళ్యాపూర్‌ గ్రామంలో పర్యటించారు. గ్రామంలో చేపట్టిన పనులను పరిశీలించి గ్రామ పంచాయతీ ఆవరణలోని చెత్తను శుభ్రపరిచారు. గ్రామంలో మొక్కలు నాటి నీరుపోశారు.

అనంతరం జడ్పీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మొదటిసారి గ్రామానికి రావడంతో సర్పంచ్‌ కాశం నిరంజని ఆధ్వర్యంలో చైర్మన్‌ విఠల్‌ రావ్‌తో పాటు, ఎంపీపీ రజినీ, జడ్పిటిసి విజయ, ఎంపీడీవో గోపాలకష్ణ లను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవి లేనప్పుడే ప్రజల మధ్య ఉండి సేవలందించాలని, పదవులు ముఖ్యం కాదని, ప్రజల మధ్య ఎల్లకాలం ఉండడమే తన ధ్యేయమని అన్నారు. పల్లెలే పట్టుకొమ్మలు అనే నినాదంతో నేటి గాంధీ కెసిఆర్‌ కార్యరూపం దాల్చిన 30 రోజుల ప్రణాళికల ద్వారా గ్రామాలను సుందరంగా అభివద్ధి చేసుకోవాలన్నారు.

రెంజల్‌ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసినప్పుడు మండలాన్ని రెండవ సింగపూర్‌గా చేయడమే లక్ష్యంగా కషి చేస్తామని అన్నారు. కెసీఆర్‌ ఆధ్వర్యంలో మహిళలకు అన్ని రంగాలలో అధిక ప్రాధాన్యత కల్పించారని, మహిళా రాజ్యం కోసం కషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్‌ అని, 50 శాతం రిజర్వేషన్లు కల్పించి మహిళలకు సమాన అవకాశాలు కల్పించారని అన్నారు.

మహిళలు 30 రోజుల ప్రణాళికలో ముందుండి ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో ఆరు చెట్లు నాటి వాటిని సంరక్షించాలి అన్నారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు రజినీ, జడ్పీటీసీ విజయ, సర్పంచ్‌, నీరంజని, ఉపసర్పంచ్‌ జలయ్య, ఎంపిటిసి సంయుక్త, ఎంపీడీఓ గోపాలకష్ణ, ప్రత్యేకాధికారి గణేష్‌ రావు, ఎంపీఓ గౌస్‌, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, టిఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు భూమారెడ్డి, రైతుసమన్వయ సమితి మండల అధ్యక్షుడు కాశం సాయిలు, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, మార్కెట్‌ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు ధనుంజయ్‌, జాగతి మండల అధ్యక్షుడు నీరడి రమేష్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు తెలంగాణ శంకర్‌, రఫిక్‌, రాము తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *