Breaking News

గ్రామాన్ని అందంగా చేయడమే 30 రోజుల ప్రణాళిక లక్ష్యం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని బజార్‌ కొత్తూరు గ్రామంలో 30 రోజుల ప్రణాలికలో భాగంగా గత 15 రోజులనుండి పారిశుద్ద పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. బజార్‌ కొత్తూరు గ్రామాన్ని అందంగా తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సర్పంచ్‌ సందింటి పోసాని బాబురావు పేర్కోన్నారు.

సోమవారం గ్రామంలోని ప్రధాన రహదారి ప్రక్కన గల పెంట కుప్పలను, ముళ్ల పొదలను తొలగించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు గత పదిహేను రోజుల నుండి ప్రణాళికలో బాగంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆశయాల మేరకు రాత్రింబవళ్లు గ్రామాన్ని అందంగా తయారు చేయడం కొరకు గ్రామస్తుల సహకారంతో పనులు చేపడుతున్నట్టు చెప్పారు. తెరాస నాయకులు బాబురావు తదితరులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *