Breaking News

Daily Archives: September 24, 2019

ఆర్మూర్‌లో కార్డెన్‌ సెర్చ్‌

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేట్‌ పరిధిలోని ఆర్మూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని మామిడి పల్లి గ్రామంలో పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ఆధ్వర్యంలో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ పిఎస్‌ పరిధిలోని మామిడి పల్లి గ్రామంలో దాదాపు 150 మంది సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా, మొత్తం 51 దిచక్ర వాహనాలు, ఆటో, ట్రాక్టర్‌లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విలేకరులతో సిపి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏడు బృందాలు ఏర్పాటు చేసి, దాదాపు ...

Read More »

29 నుంచి చండీ నవరాత్రి ఉత్సవాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి విద్యాభారతి పురం హ్రీయానందాశ్రమం చండీ మంత్రాలయంలో ఈనెల 29వ తేదీ నుంచి 39వ చండీ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. 29 నుంచి అక్టోబర్‌ 7 వరకు ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. సుప్రభాతసేవ, నవరాత్రి పూజా సంకల్పం, కుంకుమార్చనలు, హారతి, ప్రదోష పూజ, సత్సంగం తదితర కార్యక్రమాలుంటాయని తెలిపారు. భక్తులు ఉత్సవాలకు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.

Read More »

వానలో రైతు బజార్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి డెయిలీ మార్కెట్‌ నుంచి కూరగాయల వ్యాపారస్తులను మునిసిపల్‌ ప్రత్యేకాధికారి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ ఆదేశాల మేరకు గంజ్‌లోని రైతుబజార్‌కు తరలించారు. రైతుబజార్‌ షెడ్లలో కూరగాయల వ్యాపారస్తులకు అన్నిరకాల ఏర్పాట్లు చేసి అనంతరం మార్కెట్‌ తరలించాల్సి ఉండగా అవేమి చేయకుండా వారిని ఆదర బాదరగా తరలించడంతో వారు గంజ్‌ ప్రాంగణంలోనే కూరగాయలు విక్రయిస్తున్నారు. మంగళవారం భారీగా వర్షం కురియడంతో కూరగాయలన్ని వానకు కొట్టుకుపోయాయి. వానలో నానుతూ చిరువ్యాపారులు అమ్మకాలు కొనసాగిస్తున్నారు. ...

Read More »

యువకుని రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్‌ అనే యువకుడు మంగళవారం రక్తదానం చేశాడు. 36 ఏళ్ళ తాను 36 సార్లు రక్తదానం చేయడం ఆనందంగా ఉందని కిరణ్‌ పేర్కొన్నారు. మణెమ్మ అనే రోగికి అత్యవసరంగా రక్తం అవసరం కాగా, రక్తదాతల సమూహాన్ని ఆశ్రయించారు. కిరణ్‌ రక్తదానం చేసి బాధితురాలిని ఆదుకున్నారు.

Read More »

జిల్లా అట్రాసిటి కమిటీ సమావేశం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ అధ్యక్షతన మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో బాలికలు, మహిళలపై జరిగే దారుణాలు అరికట్టేందుకు జిల్లా అట్రాసిటి కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్‌పి శ్వేత, లీగల్‌ అడ్వయిజర్‌ ఇంద్రాణిదేవితో పాటు అధికారులు పాల్గొని మహిళలపై దాడులు, తీసుకోవాల్సిన చర్యలు, అరికట్టేందుకు సలహాలు, సూచనలపై చర్చించారు. లైంగిక వేధింపులు, హింసకు పాల్పడితే కఠిన చట్టాలను అమలు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read More »

ప్రత్యేక ఆరోగ్య శిబిరాల ఏర్పాటు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణ పరిధిలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బాన్సువాడ పట్టణంలో రెండుచోట్ల, కామారెడ్డి పట్టణంలోని బతుకమ్మ కుంట ఉర్దు భవన్‌లో శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలందిస్తున్నామన్నారు. వైద్యులు సుజాయత్‌ అలీ, శిరీష్‌కుమార్‌ ల ఆధ్వర్యంలో ఆరోగ్య సిబ్బంది జ్వరంతో బాధపడుతున్నవారికి రక్తపరీక్షలు ...

Read More »

ఇళ్లు మంజూరు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని బీబీపేట్‌ మండల కేంద్రంలో బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్త నర్సింహులు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి బిబిపేట్‌ మండల కేంద్రంలో నిరుపేదలకు ఇల్లు వాటిని కట్టుకోవడానికి ప్రభుత్వానికి సంబంధించిన ఐదు లక్షల రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు బడాబాబులు అద్దాలమేడలు కట్టుకున్నారని, కోట్ల రూపాయల ఇళ్లు ...

Read More »

విదేశీ పర్యటనకు స్పీకర్‌

బాన్సువాడ, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నుండి తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అధికారిక విదేశీ పర్యటనకు వెళ్ళనున్నారు. ఆఫ్రికా ఖండంలోని ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరుగుతున్న కామన్వెల్త్‌ దేశాల 64వ స్పీకర్ల సమావేశంలో పాల్గొనడానికి బుధవారం తెల్లవారుజామున శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరుతారు. కామన్వెల్త్‌ దేశాల స్పీకర్ల సమావేశంలో పాల్గొన్న అనంతరం యూరప్‌ లో పర్యటిస్తారు. అనంతరం అక్టోబర్‌ 6 న పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వస్తారు. ...

Read More »

ప్రజలకు సుపరిపాలన అందించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను అభివద్ధి చేసుకోవాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం వర్ని మండలంలోని జాకోరా గ్రామంలో 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను అన్ని విధాలుగా అభివద్ధి చేసి ప్రజలకు సుపరిపాలన అందించాలని సంకల్పంతో నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని రూపొందించి సమర్థవంతంగా అమలు చేయుటకు గ్రామస్థాయి అధికారులను ప్రజా ప్రతినిధులను ...

Read More »

ఋతుస్రావం- పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఋతుస్రావం (నెలసరి పీరియడ్స్‌) బహిరంగంగా చర్చించుకునేందుకు ముందుకు రావాలని జిల్లా సెషన్‌ జడ్జి పి శ్రీ సుధ అన్నారు. బ్లడ్‌ ఫర్‌ ఫ్రైడ్‌ స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల కమ్యూనిటీ హెల్త్‌ విభాగం సంయుక్త సహకారంతో జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఆధ్వర్యంలో మాధవ నగర్‌ లోని ఎస్‌ఎస్‌ఆర్‌ డిస్కవరీ పాఠశాలలో ఋతుస్రావం- పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సెషన్‌ జడ్జి మాట్లాడుతూ ఋతుస్రావం పట్ల మహిళల్లో ...

Read More »

తీర్మానం చేసిన పనులకే నిదులు ఖర్చు చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ రహిత గ్రామాలుగా ఉండేందుకు ప్రతి ఒక్కరు కషిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా మంగళవారం మోపాల్‌ మండలంలోని నర్సింగ్‌పల్లి గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని, గ్రామంలో ప్లాస్టిక్‌ కవర్లను సేకరించి సిద్ధం చేసిన తర్వాత మండల వారీగా రీసైక్లింగ్‌ కోసం నగరపాలక సంస్థకు పంపించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ...

Read More »

గోదావరి పరవళ్ళు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద గోదావరిలో ప్రవహిస్తోంది. మహరాష్ట్రలో కురిసిన వర్షాలతో భారి ఇన్‌ ఫ్లో గోదావరిపై కట్టిన శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. నిజామాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని శ్రీరాంసాగర్‌ రిజర్వాయర్‌ పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఆ ప్రాంతాలనుంచి ఇన్‌ ఫ్లో తగ్గినప్పటికి మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల మూలంగా గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నందిపేట్‌ మండలంలోని పాత కుస్తపురం ...

Read More »

ఏబీవీపీ ఆధ్వర్యంలో మానవహారం

రెంజల్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగులో ఉన్న 3500 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల విద్యార్థులతో కలిసి ఏబీవీపీ నాయకులు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ నవీన్‌ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసి ఎయిడెడ్‌ కళాశాలలను పరిరక్షించాలని డిమాండ్‌ చేశారు. పెండింగులో ఉన్న రియంబర్స్‌మెంట్‌ వెంటనే విడుదల చేయాలని, లేనియెడల ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ...

Read More »

ముప్పై రోజుల ప్రణాళికలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి

రెంజల్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణకు మణిహారంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మండల ప్రత్యేకాధికారి విజయ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేపడుతున్న పనులను పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన పనులను చూసి సర్పంచ్‌ వికార్‌ పాషా, పంచాయతీ కార్యదర్శి రఘురామ్‌లను అభినందించారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చిమొక్కలను తొలగించి రోడ్డు వెడల్పు పనులు, ...

Read More »

భారత సాప్ట్‌బాల్‌ జట్టుకు మమత

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి గ్రామంలోని మానస స్కూల్‌కు చెందిన మమత భారత సాఫ్ట్‌ బాల్‌ జట్టుకు ఎంపికైనట్లు మానస గణేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా తెలంగాణ సాప్ట్‌బాల్‌ అసోసియేషన్‌ ప్రధానకార్యదర్శి శోభన్‌ హాజరై మాట్లాడారు. మమత జట్టుకు ఎంపిక కావడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర అభ్యాసమే మమతను అంతర్జాతీయ స్థాయికి తెచ్చాయని అన్నారు. మానస గణేష్‌ మాట్లాడుతూ మమత అంతర్జాతీయ ...

Read More »

నన్ను ఇలాగే వదిలేస్తారా?

నందిపేట్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదిహేనేళ్ల క్రితం రూ. 10 లక్షల ప్రభుత్వ నిధులతో నన్ను అందంగా నిర్మించారు. భాజ భజంత్రీలతో నన్ను ప్రారంభిస్తారని ఆశించాను. ఇక నుంచి వందల మందికి విందు చేసుకోవడానికి అడ్డాగా వుంట అని సంతోషపడ్డ. నా నీడలో రెండు జంటలు ఏకమై షాది చేసుకొని నవ దంపతులు షాది ముబారక్‌ చెప్పుకొంటారని భావించాను. అంతలోనే ఏం జరిగిందో ఏమో కాని నన్ను ఇలా ఊరికే వదిలేశారు. నా పక్కన గల మండల కార్యాలయం ...

Read More »

హాసన్‌ పల్లిలో బతుకమ్మ చీరల పంపిణీ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌ పల్లి గ్రామంలో సర్పంచ్‌ సంగమేశ్వర్‌ గౌడ్‌, ఉప్ప సర్పంచ్‌ లింగాల సవిత, పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ రాథోడ్‌లు కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ ఆడపడుచుల కోసం తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా చీరల పంపిణీ చేయలేదని ఆరోపించారు. మహిళలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం గౌరవిస్తూ బతుకమ్మ పండగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని అన్నారు. ...

Read More »

పార చేత పట్టి పారిశుద్ధ్య పనులు చేపట్టిన సర్పంచ్‌

రెంజల్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చని పల్లెల స్వచ్చతే ధ్యేయంగా గ్రామం అభివద్ధి కావాలంటే గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించినప్పుడే గ్రామ అభివ ద్ధి సాధ్యమవుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యరూపం దాల్చిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మంగళవారం మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామంలో సర్పంచ్‌ వెల్మల సునీత గ్రామంలో స్వయంగా డ్రైనేజీ పనులను చేపట్టారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నేరుగా పరిశీలించి దగ్గరుండి పనులను చేపడతామని అన్నారు. గ్రామ అభివద్ధికి ఎల్లవేళల కషి చేస్తామని, ...

Read More »

బతుకమ్మ చీరల పంపిణీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పుర్‌ మండల కేంద్రంలోని వేల్పుర్‌, అమీనాపూర్‌, లక్కోర, మోతే, అక్లూర్‌, జాన్కంపేట్‌, షాహెబ్పేట్‌ గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిటీసి గంగమణీ, సర్పంచ్‌ వంశీకష్ణ పలువురు రాజకీయ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Read More »

కుల నిర్మూలన సదస్సు

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ది సంఘం (పిడిఎస్‌యు) ఆర్మూర్‌ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావ్‌ ఫూలే స్థాపించిన సత్యశోధక్‌ సమాజ్‌ 147 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్‌ పట్టణంలోని విజయ్‌ డీగ్రీ కళాశాలలో కుల నిర్మూలన సదస్సు నిర్వహించారు. సదస్సుకు పిడిఎస్‌యు డివిజన్‌ అధ్యక్షుడు ఎం. నరేందర్‌ అధ్యక్షత వహించగా, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ ఆర్మూర్‌ సబ్‌ డివిజన్‌ నాయకులు సుమన్‌ ముఖ్య వక్తగా హాజయ్యారు. ఈ సందర్భంగా ఆయన ...

Read More »