Breaking News

ప్రజా సమస్యలపై ఐక్యపోరాటాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎంసిపిఐయు పార్టీ కామారెడ్డి జిల్లా రాజకీయ, సామాజిక అధ్యయన తరగతులు రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హాజరైన పార్టీ అఖిలభారత కమిటీ సభ్యులు వల్లెపు ఉపేందర్‌ రెడ్డి మాట్లాడారు. నేడు పాలకులు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాన్ని తిప్పి కొట్టడానికి కార్మిక, కర్షక ఐక్యత సాధిస్తూ ఐక్య పోరాటం చేయాలన్నారు.

లేకుంటే ప్రభుత్వానికి తగిన విధంగా గుణపాఠం చెప్పలేమని, ఇందుకోసం ఐక్యపోరాటాలు బలపరుస్తూ, వామపక్షాల ఐక్యత సాధనకు జిల్లాలోని పార్టీ, ప్రజాసంఘాలు సమిష్టిగా తయారు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వనం సుధాకర్‌, జిల్లా కార్యదర్శి రాజలింగం, సహాయకార్యదర్శి జబ్బర్‌, లీల, లక్ష్మి, రాజీరు, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పిడిఎస్‌యు సభ్యత్వ నమోదు ప్రారంభం

నిజామాబాద్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *