Breaking News

Daily Archives: September 27, 2019

ప్రపంచం ఒక డిజిటలైజేషన్‌గా మారింది

బాన్సువాడ, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాప్రతినిధులు చట్టసభలలో మరింత మెరుగైన పనితీరు కనబరచడానికి ఆధునిక శాస్త్ర మరియు సాంకేతిక పరిజ్ఞానం తోడ్పడుతుందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరుగుతున్న 64వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌ లో జరిగిన నేటి రోజులలో చట్టసభల నిర్వాహణలో శాస్త్ర మరియు సాంకేతిక అంశాల ప్రభావం అంశంపై ప్రతినిధులను ఉద్దేశించి స్పీకర్‌ పోచారం మాట్లాడారు. మారిన పరిస్థితులలో శాస్త్ర, సాంకేతికత ఆధునిక ...

Read More »

వారసత్వ సంపద రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారసత్వ సంపద రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరి బాధ్యతని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా కొత్త అంబేద్కర్‌ భవన్‌లో శుక్రవారం రాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పర్యాటక రంగంలో మిగితా రంగాల కంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెప్పారు. పర్యాటక ప్రాంతం విశిష్టతతో పాటుగా ఉపాధి పెరుగుతుందని, జిల్లా పర్యాటక ప్రదేశాలు మన వారసత్వ ...

Read More »

బతుకమ్మ సంబరాల్లో అందరు పాల్గొనాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పండుగ బతుకమ్మ ఉత్సవాలు ఈనెల 28వ తేదీ నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు జిల్లాలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌. సత్యనారాయణ ప్రకటనలో తెలిపారు. 28వ తేదీన ఇంటర్‌, డిగ్రీ విద్యార్థినులతో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, 29వ తేదీన ఐసిడిఎస్‌ మహిళలతో జిల్లా పరిషత్‌ కార్యాలయంలో, 30వ తేదీన ఐకెపి, డిఆర్‌డిఏ శాఖల మహిళా సంఘాలతో స్థానిక జిల్లా పరిషత్‌ బాలుర స్కూల్లో, ...

Read More »

ఎంబిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ జయంతి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎంబిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండాలక్ష్మన్‌ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జయంతి నిర్వహించినట్లు జిల్లా అధ్యక్షుడు మఠం విజయ్‌, కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1915 సెప్టెంబర్‌ 27వ తేదీన వాంకిడిలో జన్మించి నాలుగు సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ఆత్మస్థైర్యంతో ఆసిఫాబాద్‌లో ప్రాథమిక విద్య, హైదరాబాదులో న్యాయ శాస్త్రం అభ్యసించారన్నారు. నాటి స్వాతంత్ర సంగ్రామంలో 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో భాగస్వామిగా, 1947లో ...

Read More »

ట్యాంకుబండ్‌పై కొండా లక్ష్మణ్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాతి పిత ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ 104 వ జయంతి పద్మశాలి యువజన విభాగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం కామారెడ్డి పద్మశాలి సంఘం నుంచి కొత్త బస్టాండ్‌ వద్ద గల కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కాముని సుదర్శన్‌ నేత మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ...

Read More »

బతుకమ్మ చీరలు పంపిణీ

రెంజల్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అడబిడ్డలకు అందించే చీరల కానుకలో భాగంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రెండవ రోజు మండలంలోని తాడ్‌ బిలోలి, కళ్యాపూర్‌, దండిగుట్ట గ్రామాల్లో సర్పంచ్‌లు సునీత, శ్రీదేవిలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బతుకమ్మ ఖ్యాతి పెరిగిందని పల్లెపల్లెల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తలపించేలా జరుగుతున్నాయని అన్నారు. ఆడపడుచులు అందరూ బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్నారన్నారు. ప్రతి ...

Read More »

ఘనంగా బతుకమ్మ సంబరాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో బతుకమ్మ ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలను ఈనెల 28 నుండి అక్టోబర్‌ 6 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించడానికి అన్ని శాఖల అధికారులు, ప్రభుత్వ సంస్థలు, మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు ...

Read More »

ఉన్నదాంట్లో పేదలకు సహాయం చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని పెద్ద బజార్లో గల జామా మసీదు పార్కింగ్‌ నిర్మాణాలను మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ శుక్రవారం ప్రారంభించారు. స్వంతంగా నాలుగు లక్షల నిధులు ఇవ్వడంతో పనులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మైనారిటీ పెద్దలు షబ్బీర్‌ అలీని ఘనంగా సన్మానించారు. అనంతరం మత పెద్దలు మాట్లాడుతూ షబ్బీర్‌ అలీ కషితో రాష్ట్రంలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్‌ కొనసాగుతోందని, ఈ విధానంతో ఎంతో మంది ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ...

Read More »

బతుకమ్మ సంబరాలు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలో శుక్రవారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలోని కష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో బోనాలు, బతుకమ్మలు తీసుకుని ప్రధాన రహదారి గుండా ర్యాలీగా వెళ్లి బతుకమ్మ పాటలు పాడారు. ఐలాపూర్‌ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు బతుకమ్మ వేడుకలు జరిపారు. అదేవిధంగా మండలంలోని బాద్గుణ గ్రామంలో బతుకమ్మ సంబరాలు జరిపారు.

Read More »

ఒత్తిడి వల్లే గుండెపోటు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు నగరంలోని ప్రధాన మంత్రి కౌషల్‌ కేంద్రంలో శుక్రవారం ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ గుండె వ్యాది నిపుణులు డాక్టర్‌ గోపికష్ణ, మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ విశాల్‌ వక్తలుగా హాజరై మాట్లాడారు. ఆరోగ్యకర జీవితానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. పని ఒత్తిడి, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, ధూమపానం, మత్తుపదార్థాలు, వ్యాయామం లేకపోవడం తదితర కారణాల వల్ల యుక్త వయసులోనే గుండెపోట్లు వస్తున్నాయన్నారు. తగిన ముందుజాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని ...

Read More »

జోరుగా చీరల పంపిణీ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది. రెండవ రోజు పలువురు ప్రజాప్రతినిధులు వివిధ గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామంలో సర్పంచ్‌ చయ చందు, రైతు సమన్వయ కమిటీ మండల డైరెక్టర్‌ మల్లారెడ్డి, టిఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు సురేష్‌, తొండకూర్‌ గ్రామంలో సర్పంచ్‌ కురుమే దేవన్న, ఎంపిటిసి మద్దుల రాణి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Read More »

బాపూజీ అడుగుజాడల్లో నడవడమే అసలైన నివాళి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర సమర యోధుడు తెలంగాణ పోరాట స్ఫూర్తి కొండా లక్ష్మణ్‌ బాపూజీ ప్రజల కోసం ఏ విధంగా తన జీవితాన్ని అంకితం చేశారో ఆయన మార్గంలో పయనించడమే ఆయనకు మనం అర్పించే అసలైన నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జయంతి ఉత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం కొరకు, ఆ ...

Read More »

నేడు మహాజన సభ

రెంజల్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం రెంజల్‌ మండల ప్రాథమిక సహకార సంఘం మహాజన సభను చైర్మన్‌ మోహీనోద్దీన్‌ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి రాందాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మహాజన సభకు డైరెక్టర్లు, రైతులు సకాలంలో హాజరుకావాలన్నారు.

Read More »

నిఖార్సయిన తెలంగాణ వాది కొండా లక్ష్మణ్‌ బాపూజీ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్‌ బాపూజీ 104వ జయంతిని శుక్రవారం నందిపేట్‌ మండల కేంద్రంలో తెరాస నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మండల కో ఆప్షన్‌ నెంబర్‌ సయ్యద్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ 1915 సెప్టెంబర్‌ 27వ తేదీన అదిలాబాద్‌ జిల్లా వాంకిడి గ్రామంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ జన్మించారని, గాంధీతో కలిసి క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. ...

Read More »

పర్యాటక ప్రాంతాల అభివద్ధికి కషి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటిని అభివద్ధి చేయుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా విద్యార్థులను జిల్లాలోని పర్యాటక కేంద్రాలకు తీసుకువెళ్లే వాహనానికి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక కేంద్రాల అభివద్ధి వల్ల ఉపాధితో పాటు ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివద్ధి చెందుతాయని తెలిపారు. పర్యాటక పర్యటన వల్ల పర్యాటకులకు ఆ ప్రాంతాలకు సంబంధించి చారిత్రక ...

Read More »