Breaking News

కేర్‌ డిగ్రీ కళాశాలలో… ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటపాటలతోడి ఉయ్యాలో.. ఆనందాల తోడి ఉయ్యాలో…గంగమ్మ, గౌరమ్మ కోల్‌… పున్నామా పున్నామా నిండూ పున్నామా… సిరిమా లేలో… రంగు రంగు పూలు తెచ్చి రాసుల్లు పోసి అంటూ సంప్రదాయ పాటలతో, భక్తి శ్రద్దలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. స్థానిక కేర్‌ డిగ్రీ కళాశాలలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ మాట్లాడుతూ ప్రతియేడు అత్యంత వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించడం జరుగుతుందన్నారు. బతుకమ్మ పండగ అంటే ప్రకృతిని ఆరాధించడమని అన్నారు. కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

నగర మేయర్‌ ఆధ్వర్యంలో రక్తదానం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని రెడ్‌ క్రాస్‌ సొసైటీలో రక్త నిధుల‌ కొరత ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *