Breaking News

Daily Archives: September 29, 2019

ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

రెంజల్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని పలు గ్రామాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి విగ్రహంతో తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం మొదటిరోజు అమ్మవారిని మండపాల్లో ప్రతిష్టించారు. రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో మొదటి సారి దుర్గామాతని ప్రతిష్టించారు. ఊరి పొలిమేర నుండి మహిళలు, గ్రామస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళ హారతులతో బాజాభజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామంలో ప్రతిష్టించారు. దేవి ...

Read More »

ఏఐసిటియు ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన నాయకులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఐక్య బిల్లింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంతంపల్లి రమేష్‌ గత 20 రోజులుగా వైరల్‌ జ్వరంతో బాధ పడుతున్నాడు. అతనికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్ల అతను 20 రోజుల నుంచి మంచాన పడ్డాడు. విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఎంసిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం ఏఐసిటియూ అనుబంధ ప్రజాసంఘాల కన్వీనర్‌ జబ్బర్‌ నాయక్‌ పార్టీ ...

Read More »

ఎల్లాపి సంఘం కార్యవర్గం ఎన్నిక

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఎల్లాపి సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం నగరంలోని దుబ్బ ప్రాంతంలోని ఎల్లాపి సంఘ భవనంలో ఇందుకు సంబంధించి ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడుగా ఎల్లంకి సత్యనారాయణరావు, ఉపాద్యక్షుడుగా పుప్పల లక్మణ్‌ రావు, ఎల్లంకి పురుషోత్తం రావు, ఔదరి శారద, ప్రదాన కార్యదర్శిగా తేలు వేణుగోపాల్‌ రావు, కోశాధికారిగా ఔదరి నర్సింగరావు, ఆర్గనైజింగ్‌ సేక్రేటరిగా బొంగురాల శ్రీనివాస్‌ రావు, జనరల్‌ సెక్రటరీలు వీర్ల శ్రీనాథ్‌ రావు, వీరమల్ల లక్మీకాంత రావులను ఎన్నుకున్నారు. ...

Read More »

మంత్రి పర్యటన ఖరారు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పర్యటన ఖరారైంది. అక్టోబర్‌ 1వ తేదీన సదాశివనగర్‌ మండలంలో మంత్రి పర్యటించనున్నారు. 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా మండలంలోని కుప్రియాల్‌, పద్మాజివాడి గ్రామాల్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రి పాల్గొంటారు.

Read More »

ఉచిత ఆర్ట్‌ తరగతులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ విపంచి సంస్కృతి సంస్థ అధ్వర్యంలో విద్యార్థులకు, చిన్నారులకు వర్లీ ఆర్ట్‌, మధుబని ఆర్ట్‌ తరగతులు నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని శంకర్‌ భవన్‌ పాఠశాలలో ఆదివారం ఆర్ట్‌ తరగతులు నిర్వహించినట్టు సంస్థ ప్రతినిదులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గిరిజా గాయత్రి, లలిత, లక్ష్మి, దాసు తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్‌ తరగతులు మంగళవారం అక్టోబర్‌ 1వ తేదీ కూడా నిర్వహించబడతాయని శ్రీ విపంచి సంస్థ అధ్యక్షులు గిరిజా గాయత్రి తెలిపారు.

Read More »

కబడ్డి శిక్షణ తరగతులు ప్రారంభం

నందిపేట్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం ఐలాపూర్‌ గ్రామంలో నంది స్పోర్ట్స్‌ అకాడమీ ఆధ్వర్యంలో కబడ్డీ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. మండల స్థాయి యువకులు ఎవరైనా ఉచితంగా కబడ్డీలో శిక్షణ పొందవచ్చని కోటేశ్వర్‌ తెలిపారు.

Read More »

చెత్త వేస్తే జరిమానా వేయండి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని అయినా వినకుంటే జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన ఆదివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోను, ఇందల్వాయి మండల కేంద్రంలోను, జక్రాన్‌పల్లి మండల కేంద్రం లోను, మునిపల్లి గ్రామంలో పర్యటించి హరితహారం, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ముఖ్య రహదారులో బస్టాండ్‌ చుట్టుపక్కల మురికినీరు, చెత్త ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ...

Read More »

బాన్సువాడలో సందడి చేసిన సినీ తార ప్రణతి సుభాష్‌

బాన్సువాడ, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్‌ కేంద్రంలో ఆదివారం ఎస్‌ఎస్‌ షాపింగ్‌ మాల్‌ను సినీతార ప్రణతి, రాష్ట్ర నాయకులు బాస్కర్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సినీతార మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎస్‌ఎస్‌ షాపింగ్‌ మాల్‌ ప్రారంభించడం తనకు సంతోషంగా ఉందన్నారు. బాన్సువాడ ప్రాంతంలో మంచి వాతావరణం ఉందని, ఇక్కడ పెద్ద షాపింగ్‌ మాల్‌ ఏర్పాటు చేయడం మంచి పరిణామమన్నారు. ఎస్‌ ఎస్‌ షాపింగ్‌ మాల్‌ వ్యాపారవెత్త శ్రీనివాస్‌ మాట్లాడుతూ బాన్సువాడ డివిజన్‌ ...

Read More »

కాశ్మీర్‌ కార్పొరేట్‌ కంపెనీల పరం కాబోతుంది..

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పౌర హక్కుల సంఘం (సిఎల్‌సి) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాశ్మీర్‌ ప్రజల హక్కులకై ఉద్యమిద్దాం అన్న అంశంపై జిల్లా ప్రెస్‌ క్లబ్‌లో సెమినార్‌ నిర్వహించారు. సిఎల్‌సి జిల్లా అధ్యక్షులు మువ్వా నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా హాజరైన పౌర హక్కుల సంఘం (సిఎల్‌సి) రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది వి.రఘునాథ్‌ మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా, కాశ్మీర్‌ ప్రజల ఆకాంక్షల ప్రమేయమే లేకుండా, వారికి ఉన్న ప్రత్యేక చట్టబద్ధ హక్కులను ఆర్టికల్‌ 370, ...

Read More »

ఖాళీ స్థలాలతో ఇక్కట్లు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలోని వివిధ కాలనీలలో ఖాళీ ఇళ్ల స్థలాలు పందులకు నిలయంగా మారాయి. ఇందులో పెద్ద ఎత్తున తుంగ, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీనికితోడు మురుగునీరు, వర్షం నీళ్ళు పెద్ద ఎత్తున రోజుల తరబడి నిలువ ఉంటున్నాయి. దాంతో ఖాళీ స్థలాలు దోమలకు, పందులకు నిలయంగా మారాయి. వాటి పక్కన గల ఇళ్లలో నివసించే వారు దోమకాటుతో రోగాల బారిన పడుతున్నారు. గ్రామంలోని రాజనగర్‌, రాంనగర్‌, దుబ్బ, పాతూరు, బస్టాండ్‌ వెనకాల, ...

Read More »