Breaking News

చెత్త వేస్తే జరిమానా వేయండి…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎక్కడపడితే అక్కడ చెత్త వేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని అయినా వినకుంటే జరిమానా విధించాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆయన ఆదివారం డిచ్‌పల్లి మండల కేంద్రంలోను, ఇందల్వాయి మండల కేంద్రంలోను, జక్రాన్‌పల్లి మండల కేంద్రం లోను, మునిపల్లి గ్రామంలో పర్యటించి హరితహారం, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు.

డిచ్‌పల్లి మండల కేంద్రంలోని ముఖ్య రహదారులో బస్టాండ్‌ చుట్టుపక్కల మురికినీరు, చెత్త ప్లాస్టిక్‌ వ్యర్ధాలు ఉండడంపై శుభ్రం చేయకపోవడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత గ్రామ కార్యదర్శి సరిగా సహకరించడం లేదని అధికారులు తెలపడంతో అతనికి జిల్లా పంచాయతీ అధికారి ద్వారా షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.

ఇందల్వాయి మండల కేంద్రంలో బస్టాండు చుట్టుపక్కల చెత్త తొలగించక పోవడం, దుకాణదారులు వారి దుకాణాల వద్ద పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, బస్టాండ్‌లో గల త్రాగునీటి సదుపాయం, మరుగుదొడ్లు ఉపయోగంలో లేకపోవడంపై బస్టాండ్‌ ఇన్‌చార్జిని ప్రశ్నించారు. జిల్లా ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌తో మాట్లాడి వెంటనే వాటిని పునరుద్ధరించాలని తెలిపారు.

జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో ప్రధాన రహదారి వద్ద, ప్రజల ఆవాసాల నుండి మురుగునీరు ప్రవహించడంపై అధికారులను ప్రశ్నించారు. అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల బాధ్యత భాగస్వామ్యం కూడా ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

అన్ని ప్రాంతాల్లోనూ కొత్తగా నిర్మించే భవనాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకున్న తర్వాతనే నిర్మాణాలు ప్రారంభించేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఓపెన్‌ ప్లాట్లలో వేయకుండా సంబంధిత ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 30 రోజుల కార్యక్రమంలో అన్ని గ్రామాల్లోనూ మున్సిపాలిటీలలోను తప్పనిసరిగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి ఎక్కడ కూడా ప్లాస్టిక్‌ వ్యర్ధాలు చెత్త, మురుగు నీరు ఉండకుండా చూడాలని మోరీలు శుభ్రం చేయాలని ఆదేశించారు.

లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులు ఏర్పాటుచేసి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, బడ్జెట్‌కు అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో తీర్మానాలను బట్టి క్రమంలో ప్రజలకు అవసరమయ్యే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో డిచ్పల్లి ఎంపీడీవో సురేందర్‌, ఇందల్వాయి ఎంపీడీవో రాములు, జక్రాన్పల్లి ఎంపీడీవో భారతి, ఎంపీపీ హరిత, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *