Breaking News

ఖాళీ స్థలాలతో ఇక్కట్లు

నందిపేట్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ గ్రామంలోని వివిధ కాలనీలలో ఖాళీ ఇళ్ల స్థలాలు పందులకు నిలయంగా మారాయి. ఇందులో పెద్ద ఎత్తున తుంగ, పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. దీనికితోడు మురుగునీరు, వర్షం నీళ్ళు పెద్ద ఎత్తున రోజుల తరబడి నిలువ ఉంటున్నాయి. దాంతో ఖాళీ స్థలాలు దోమలకు, పందులకు నిలయంగా మారాయి. వాటి పక్కన గల ఇళ్లలో నివసించే వారు దోమకాటుతో రోగాల బారిన పడుతున్నారు.

గ్రామంలోని రాజనగర్‌, రాంనగర్‌, దుబ్బ, పాతూరు, బస్టాండ్‌ వెనకాల, బైపాస్‌ రోడ్డు పక్కన గల ఖాళీ స్థలాలు మురికి కూపంగా తయారవుతున్నాయి. కాలనీలలో మురికి కాలువలు సిసి రోడ్ల నిర్మాణాలు జరగకపోవడం వల్ల మెయిన్‌ రోడ్డుపై వర్షపు నీరు కాలనీలోని ఖాళీ స్థలాల్లో వచ్చి చేరుతున్నాయి. వీటితోపాటు స్థల యజమానులు ఇల్లు నిర్మించకుండా ఖాళీగా ఉంచడంతో పెద్ద ఎత్తున పిచ్చి మొక్కలు పెరిగి పోతున్నాయి.

ఖాళీ స్థలాలలో మొరం నింపి భర్తీ చేసినట్లయితే ఇక్కడ మురికి నీరు నిల్వ ఉండడానికి ఏమాత్రం ఆస్కారం ఉండదు, కానీ ప్లాట్‌ యజమానులు కేవలం పెట్టుబడుల కోసం స్థలాలు కొనుగోలు చేసి వాటికి సంవత్సరాల తరబడి అలాగే వదిలి పెడుతున్నారు.

ఇలాంటి ఖాళీ ఇళ్ల స్థలాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతం గ్రామంలో దోమల సంఖ్య విపరీతంగా పెరిగి పోవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రాత్రివేళ చిన్నారులు, మహిళలు స్థలాలను అనుకుని ఉన్న దారి గుండా వెళ్లాలంటే జంకుతున్నారు. ప

పరిష్కారం లేదా?

రహీం బర్కత్‌ పురా

మా ఇంటి ప్రక్కన ఖాళీస్థలం యజమానిని శుభ్రం చేయమని ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదు. మీ ఇంటిలో మీరు శుభ్రంగా ఉంచుకోండి, మా జాగ తో మీకేం అవసరం అంటున్నారు. అధికారులకు కూడా ఇట్టి విషయం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఇతరుల ప్లాట్లు మేము ఎలా సాఫ్‌ చేస్తామని అధికారులు

బదులు ఇస్తున్నారు.

ఖాళీ స్థలంలో శుభ్రం చేయించాలంటే గ్రామ పంచాయతీలకు తలకు మించిన భారమవుతుంది. యజమానికి చెబుదామంటే గ్రామ నివాసి అయితే చెప్పడానికి వీలవుతుంది, కానీ ఇతర గ్రామాల వారు వ్యాపారం కొరకు స్థిర ఆస్థి కొరకు కొని వదిలేస్తారు. అటువంటి వారికి తెలియపరచడం వీలుపడదు. కాబట్టి గ్రామ గ్రామ పాలకవర్గం ముందుగా గ్రామంలోని వెంచర్‌ మ్యాప్‌ రికార్డ్‌లను సేకరించి ఫైల్‌ రూపంలో గ్రామపంచాయతీలో ఉంచాలి.

తర్వాత నోటీస్‌ బోర్డ్‌ మరి పత్రికల ద్వారా ప్రచారం చేసి ప్లాట్లు ఎవరు కొనుగోలు చేసినా తమ ప్లాటు కొనుగోలు వివరాలు ఉచితంగా గ్రామ పంచాయతీలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని ప్రచారం చేయాలి. అప్పుడు యజమానులు తమ ప్లాట్‌ వివరాలు గ్రామపంచాయతీలో తెలుపుతారు. దాని వలన వారి యొక్క ఫ్లాట్‌ కూడా కబ్జాలకు గురి కాకుండా సురక్షితంగా ఉంటుంది.

మరి గ్రామపంచాయతీ కూడా వారి ప్లాట్‌ గురించి వివరాలు తెలుస్తాయి. తద్వారా యజమానుల వద్ద నుండి ప్లాట్‌ మెయింటెనెన్సు రుసుము తీసుకొని వారియొక్క ప్లాట్‌ను శుభ్రపరచడం చేయవచ్చు. దాని మూలంగా కాలనీలో శుభ్రత నెలకొంటుంది.

The following two tabs change content below.

Check Also

గర్భిణీల‌కు పోషకాహారం పంపిణీ చేసిన ఎంపిటిసి

నందిపేట్‌, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం షాపురు గ్రామంలోని అంగన్‌వాడి కేంద్రంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *