Breaking News

ఏఐసిటియు ప్రధాన కార్యదర్శిని పరామర్శించిన నాయకులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఐక్య బిల్లింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంతంపల్లి రమేష్‌ గత 20 రోజులుగా వైరల్‌ జ్వరంతో బాధ పడుతున్నాడు. అతనికి మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ డాక్టర్లు నిర్లక్ష్యంగా వైద్యం చేయడం వల్ల అతను 20 రోజుల నుంచి మంచాన పడ్డాడు.

విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా ఎంసిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం ఏఐసిటియూ అనుబంధ ప్రజాసంఘాల కన్వీనర్‌ జబ్బర్‌ నాయక్‌ పార్టీ నాయకులు మద్దెల రాజు బ్రహ్మాజీవాడిలోని రమేశ్‌ ఇంటికెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల పండుగ పేరుతో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను చేపట్టి వైరస్‌ జ్వరాలు అరికట్టాల్సిన ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వైద్యులు పట్టించుకోకపోవడం వల్ల అతని ఆరోగ్యం క్షీణించిందన్నారు.

ఇప్పటికైనా కామారెడ్డి జిల్లా ఆసుపత్రి వైద్యులు తాడ్వాయి మండల వైద్యులు భవన నిర్మాణ సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్‌ చేశారు. అతని ఆరోగ్యం మరింత క్షీణిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యంపై కార్మిక సంక్షేమాన్ని దష్టిలో ఉంచుకొని ఐక్య భవన నిర్మాణ సంఘం ఏఐసిటియు ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యంపై పోరాటం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

గ్రామానికి చెందిన ఏఎన్‌ఎం జిల్లా ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఎంసిపిఐయు పార్టీ చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, జిల్లా వైద్య శాఖ అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కార్మిక సంఘ నాయకుల రక్షణకోసం ఏఐసీటీయు కార్మిక నాయకునికి అండగా నిలబడి తీరుతుందని అన్నారు.

Check Also

తెరాసలో చేరిన ఎంపిటిసి నిమ్మ శంకర్‌

కామారెడ్డి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోమకొండ మండల‌ కేంద్రం 1వ ఎంపీటీసీ సభ్యుడు నిమ్మ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *