Breaking News

ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

రెంజల్‌, సెప్టెంబర్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని పలు గ్రామాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి విగ్రహంతో తొమ్మిది రోజులు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆదివారం మొదటిరోజు అమ్మవారిని మండపాల్లో ప్రతిష్టించారు.

రెంజల్‌ మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో మొదటి సారి దుర్గామాతని ప్రతిష్టించారు. ఊరి పొలిమేర నుండి మహిళలు, గ్రామస్తులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని మంగళ హారతులతో బాజాభజంత్రీలతో అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొచ్చి గ్రామంలో ప్రతిష్టించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నియమనిష్ఠలతో స్వాములు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అమ్మవారు తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. తొమ్మిది రోజులు స్వాములకు మండపాల వద్దనే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *