Breaking News

ఆర్టికల్‌ 370 రద్దుపై అవగాహన

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీజిల్లా శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని రాజారెడ్డి గార్డెన్‌లో ఆర్టికల్‌ 370 రద్దుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా అద్యక్ష్యుడు బాణాల లక్మరెడ్డి మాట్లాడారు. రెండవ సారి కేంద్రంలో నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆర్టికల్‌ 370 ని రద్దు చేసిన విషయం తెలిసిందేనన్నారు.

దీనిపై కొన్ని రాజకీయ పక్షాలు కావాలని తప్పు దోవ పట్టిస్తున్నాయని, అందువల్ల ప్రజలకు, మేధావులకు, విద్యార్థులకు 370 రద్దు విషయమై అవగాహన కొరకు దేశ వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే కామారెడ్డిలో కూడా డాక్టర్లు , రిటైర్డు ఉద్యోగస్తులు, న్యాయవాదులు, మేధావులతో సమావేశమయ్యామని చెప్పారు.

కార్యక్రమానికి వక్తగా విచ్చేసిన సుప్రీం కోర్టు న్యాయవాది దిలీప్‌ కుమార్‌ దుబే మాట్లాడుతూ భారత స్వతంత్ర అనంతరం హైదరాబాద్‌, మైసూర్‌, కాశ్మిర్‌ సంస్థానాలు కొన్ని రోజులు స్వతంత్రంగా వ్యవహరించాయని తరువాత సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ అన్ని సంస్థానాలను భారతదేశంలో విలీనం చేశారని అన్నారు. మహారాజా హరిసింగ్‌ కాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేస్తూ ఇచ్చిన ఒప్పందం (ఇన్‌స్ట్రుమెంట్‌ ఆఫ్‌ అసెషన్‌) తో జమ్ము కాశ్మీరు స్వతంత్ర ప్రతిపత్తి కోల్పోయి భారతదేశంలో ఒక భాగమైందని అన్నారు.

కానీ అప్పటి నెహ్రు ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆర్టికల్‌ 370 పేరుతో కొత్త నిబంధన పెట్టి జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ నాటి భారత ప్రభుత్వం చేసిన ఏర్పాటే ఆర్టికల్‌ 370 అన్నారు. ఆర్టికల్‌ వల్ల రాజ్యాంగం ప్రకారం ఇతర రాష్ట్రాలకు వర్తించిన నిబంధనలేవీ జమ్మూ కశ్మీర్‌కు వర్తించవని, దీని ప్రకారమే 1965 వరకూ ఆ రాష్ట్రానికి సీఎం బదులు ప్రధాని, గవర్నర్‌ స్థానంలో ప్రెసిడెంట్‌ ఉండేవారన్నారు.

ఆర్టికల్‌ 370 పట్ల రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారని గుర్తుచేశారు. అప్పటి కేంద్ర మంత్రి శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ నెహ్రూతో విభేదించి బయటికి వచ్చి భారతీయ జనసంఘ్‌ ఏర్పాటు చేశారని, జనసంఘ్‌ ఏర్పాటు చేయడానికి గల కారణాలలో 370 ఆర్టికల్‌ రద్దు అంశం కూడా ముఖ్యమైనదని వివరించారు.

ఈ ఆర్టికల్‌ ప్రకారం ఇతర రాష్ట్ర పౌరుడు అక్కడ ఆస్తులు కొనుగోలు చేయరాదని, చదువుకుంటే అతనికి ఎలాంటి ప్రభుత్వ సౌకర్యాలు ఉండవని, అక్కడ ఉద్యోగాలలో వేరే రాష్టం వాళ్ళకి అవకాశం ఉండబోదన్నారు. ఆ రాష్టంలో స్థానికత 1947 కు ముందు ఆ రాష్టంలో ఉన్న వాళ్లకు మాత్రమే ఉంటుందన్నారు. అన్ని అధికారాలు కేవలం రాష్ట ప్రభుత్వానికి మాత్రమే ఉంటాయన్నారు.

ఇక ఆర్టికల్‌ 35 ఎ ప్రకారం కాశ్మీరీ యువతులు వేరే రాష్ట్ర అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే ఆ రాష్ట్ర సభ్యత్వం కోల్పోతారని, తరువాత వాళ్ళ పిల్లకు కూడా అక్కడ ఆస్తులపై హక్కు ఉండదన్నారు. జమ్ముకశ్మీర్‌లో కేవలం రక్షణ, విదేశీ వ్యవహారాలు, సమాచార ప్రసారాల వరకే కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయన్నారు. అంతే కాకుండా ఆర్టికల్‌ 35 ఎ అనేది రాజ్యాంగంలో కానీ, గెజిట్లో కానీ, పార్లమెటులో కానీ ఎక్కడ పొందు పరచలేదని, 2007 అమర్‌ నాథ్‌ యాత్రికుల విషయంలో గొడవలు జరిగే వరకు ఎలాంటి ఆర్టికల్‌ ఉన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదన్నారు.

ఇలా దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాశ్మిర్‌కు సంబంధం లేకుండా చేసే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం తీసుకొని మోదీ చారిత్రక నిర్ణయం తీసుకున్నారన్నారు. ఒకే దేశం, ఒకే రాజ్యాంగం స్పూర్తితో తీసుకున్న నిర్ణయాన్ని యావత్‌ భారతం స్వాగతించాలని అన్నారు.

Check Also

జంగంపల్లి కృష్ణమందిరం వద్ద అన్నదానం

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జంగంపల్లి కృష్ణ మందిరం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *