Breaking News

పాడి పశువులకు విశిష్ట గుర్తింపు సంఖ్య

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతీ పశువుకు ఒక విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయింపు కార్యక్రమం సోమవారం ఆర్మూర్‌ మండలంలోని సుర్బీర్యాల్‌ గ్రామంలో కొనసాగింది. కార్యక్రమంలో 132 పశువులకు విశిష్ట గుర్తింపు సంఖ్య కలిగిన ట్యాగులు (చెవి పోగులు) పశువుల చెవులకు వేయడం జరిగిందని మిగిలిన పశువులకు సాయంత్రం, మంగళవారం ఉదయం వేయడం జరుగుతుందని డాక్టర్‌ లక్కం ప్రభాకర్‌ తెలిపారు.

సుర్బీర్యాల్‌ గ్రామ పాడి రైతులు పశుసంవర్ధక శాఖ ద్వారా పూర్తి ఉచితంగా చేస్తున్న కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. సమీప భవిష్యత్తులో పాడి పశువులకు ఎటువంటి టీకాలు వేయడమైనా లేక ఎటువంటి చికిత్సలు అందివ్వడానికైనా 16 అంకెలు కలిగిన విశిష్ట నెంబర్‌ ఆధారంగానే కార్యక్రమాలు చేయబడతాయని అన్నారు.

పాడి రైతులు తమ వంతు బాధ్యతగా గ్రామంలో అందుబాటులో ఉండబోయే మండల పశుసంవర్ధక శాఖ అధికారిని గానీ లేక పశువైద్య సిబ్బందిని గానీ గ్రామంలో ఉన్న పశువైద్యశాలలో సంప్రదించి తమ తమ పాడి పశువులకు ఖచ్చితంగా చెవి పోగులు వేయించుకోవాల్సిందిగా డాక్టర్‌ ప్రభాకర్‌ లక్కం కోరారు.

Check Also

వల‌స కార్మికుల‌కు మజ్జిగ పంపిణీ చేసిన పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులు

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లాక్‌ డౌన్ మూలంగా కాలినడకన‌ తమ స్వస్థలాల‌కు వెళ్తున్న ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *