Breaking News

బతుకమ్మ చీరల పంపిణీ

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మచ్చర్ల గ్రామంలో సోమవారం బతుకమ్మ చీరలు పంపిణి చేశారు. ఎంపిపి పస్క నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొని చీరలు పంపిణి చేశారు. అనంతరం మాట్లాడుతూ బతుకమ్మ పండుగను సంతోషంగా నిర్వహించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడపడుచులకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.

ఇది ఓట్ల కోసం కాదు బంధుత్వాలు పెంచుకోడానికి అని గుర్తు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గంజి నర్సయ్య, ఉప సర్పంచ్‌ గంగా రెడ్డి, వార్డు సభ్యులు డేవిడ్‌ లింగక్క తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి

నందిపేట్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *