Breaking News

కొనసాగుతున్న చీరల పంపిణీ

నందిపేట్‌, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం పలు గ్రామాల్లో సోమవారం కూడా కొనసాగింది. చీరెలు అనేక రంగులు, డిజైన్లలో ఆకర్షణీయంగా ఉండడంతో వాటిని తీసుకున్న మహిళలు మురిసిపోయారు. నందిపేట మండలంలోని వెల్మల్‌ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో నందిపేట్‌ వైస్‌ ఎంపీపీ దేవేందర్‌ పాల్గొని ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.

సర్పంచ్‌ మచ్చర్ల సాయమ్మ, ఉపసర్పంచ్‌ ముపెడా నారాయణ, టిఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు. మండలం అంతటా సజావుగా పంపిణి కార్యక్రం కొనసాగుతుందని తహహిల్డార్‌ అలివేలు తెలిపారు.

మండల కేంద్రంలో మండల కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్‌ల ద్వారా చీరల పంపిణి కార్యక్రమం సజావుగా సాగుతుందని నందిపేట విఆర్‌ఓ రాజేశ్వర్‌ తెలిపారు.

Check Also

జనాభా లెక్కల్లో బిసి గణన చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేమెంతో మాకు అంతే వాటా కావాలంటే మా జనాభా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *