Breaking News

పచ్చదనం, పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో పచ్చదనం పరిశుభ్రత స్పష్టంగా కనిపించాలని లేనిపక్షంలో ఎవరిని ఉపేక్షించేది లేదని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సోమవారం మున్సిపల్‌ ఇంజనీర్లు సానిటేషన్‌ సిబ్బందితో కలిసి నగరంలోని బోధన్‌కు వెళ్లే ప్రధాన రోడ్డుపై బోధన్‌ చౌరస్తా నుండి మాలపల్లి అర్సపల్లి సారంగాపూర్‌ వరకు శానిటేషన్‌, పరిసరాల పరిశుభ్రత, హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చెత్త చెదారం లేకుండా మురుగుకాలువ శుభ్రత, మురికి నీరు నేరుగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని పదే పదే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంకను పనితీరు మారలేదని సానిటేషన్‌ సిబ్బందిపై ఆగ్రహించారు. అక్కడక్కడ చెత్త చెదారంతో పాటు మురుగు కాలువల శుభ్రత లేకపోవడం నీరు నిలిచి ఉండడంతో సాయంత్రంలోగా శుభ్రం చేసి నివేదిక అందజేయాలని నగరపాలక ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు.

సారంగాపూర్‌లో నాటిన మొక్కలకు నీరు పోయాక ఎండిపోయిన మొక్కలకు వెంటనే నీరు పోసి సంరక్షించాలని ఆదేశించారు. అక్కడ నుండి అర్సపల్లి రైల్వే గేటు మీదుగా నూతనంగా నిర్మిస్తున్న కలెక్టర్‌ ప్రధాన ద్వారం సమీపంలో చెత్తాచెదారం నిలిచిపోయిన నీరును వెంటనే తొలగించి శుభ్రంగా ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు.

బైపాస్‌ రోడ్డుకు డివైడర్ల నిర్మాణాల పనులను వెంటనే పూర్తి చేసి మొక్కలు నాటాలని చెప్పారు. జిల్లా కలెక్టర్‌ వెంట నగరపాలక సంస్థ ఇంజనీర్లు రషీద్‌, ఆనంద్‌ తదితరులు ఉన్నారు.

Check Also

పారిశుద్య పనులు పర్యవేక్షించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని జోన్‌ 1 పరిదిలోని 37వ డివిజన్‌, 16వ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *