Breaking News

స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని నందిపేట ఎండిఓ నాగవర్ధన్‌ అన్నారు. నిజామాబాదు జిల్లా నందిపేట మండలం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సోమవారం అంగన్‌వాడి టీచర్లతో కలిసి ఐకెపి కార్యాలయం ముందు శ్రమదానం నిర్వహించి పిచ్చి మొక్కలను తొలగించారు.

అనంతరం మాట్లాడుతు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకునేందుకు ప్రతీ ఒక్కరు కషి చేయాలన్నారు. ముఖ్యంగా అంగన్‌వాడి టీచర్ల క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. కార్యక్రమంలో నందిపేట విఆర్‌ఓ రాజేశ్వర్‌, అంగన్‌వాడి టీచర్ల సూపర్‌వైజర్లు, మండలంలోని అన్ని గ్రామాల అంగన్‌వాడి టీచర్లు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *