Breaking News

30 రోజుల ప్రణాళిక పనులు చురుకుగా సాగుతున్నాయి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 30 రోజుల ప్రణాళిక ద్వారా గ్రామాల్లో చేపట్టిన పచ్చదనం, పారిశుద్ధ్యం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠధామం, మంకీ ఫుడ్‌ కోర్టుల ఏర్పాట్లు, పవర్‌ వీక్‌ సందర్భంగా శిధిలమైన విద్యుత్‌ స్తంభాలను తీసివేసి కొత్తవి అమర్చడం, వీధి దీపాల కోసం వైరింగ్‌ ఏర్పాటు చురుకుగా సాగుతున్నట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ తెలిపారు.

సోమవారం కలెక్టర్‌ గాంధారి మండలం నేరెళ్ల గ్రామంలో 30 రోజుల కార్యక్రమాలను పరిశీలించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి నీరుపోశారు. గ్రామంలో రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు, ముళ్ళ పొదలు తొలగించి, శుభ్రం చేసి చేపట్టిన మొక్కల పెంపకం పనులను చూసి గ్రామస్తులను అభినందించారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఉత్సాహంతో పనుల్లో భాగస్వామ్యం అవుతున్నారని అన్నారు.

గ్రామాలలో రోడ్ల వెంబడి కంపచెట్లు తొలగించడం, మొక్కలు నాటి వాటికి రక్షణ కల్పించడం, మురికి కాలువలలో పూడిక తీయడం జరుగుతున్నదని తెలిపారు. డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామం ప్రతి గ్రామంలో తప్పనిసరిగా ఉండాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యమని, లేని గ్రామాలలో వాటిని నెలకొల్పడం జరగుతుందని తెలిపారు.

ప్రతి గ్రామంలో గ్రామ అవసరాలు గమనించి మొక్కలు పెంచడానికి నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందని, మంకీ ఫుడ్‌ కోర్ట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు, వాటిలో పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందని తెలిపారు.

ప్రతి ఇంటికి దోమలు రాకుండా ఉండేందుకు పది కష్ణ తులసి మొక్కలు, ప్రతి ఇంటికి కరివేపాకు, వేప, నాలుగు రకాల పళ్ళ మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, రైతులకు పొలం గట్ల మీద వేప, చింత, టేకు మొక్కలు అందించడం జరుగుతుందని, గ్రామాలలో అంతర్గత రోడ్ల వెంబడి పెట్రోఫామ్‌, గుల్మరా తదితర చెట్లను పెంచడం జరుగుతుందని, వీటికి అవసరమైన మొక్కలను గ్రామపంచాయతీ నర్సరీలోనే పెంచడం జరుగుతుందని తెలిపారు.

500 జనాభా దాటిన గ్రామ పంచాయతీకి ట్రాక్టరు, ట్రాలీ, టాంకర్‌ కలిపి ఇవ్వడం జరుగుతుందని, వీటి ద్వారా చెత్త తొలగించడం, మొక్కలకు నీరు పోయడం తదితర పనులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అలాగే గ్రామానికి కావాల్సిన వసతులపై సంవత్సరం, ఐదు సంవత్సరాల యాక్షన్‌ ప్లాన్‌ గ్రామ సభలో తీర్మానం చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ప్రతిభ కనబరిచిన ప్రతి మండలంలో మూడు గ్రామాలకు ప్రధమ, ద్వితీయ, తతీయ బహుమతి కింద లక్ష రూపాయలు బహుమతిగా వచ్చే గణతంత్ర దినోత్సవం నాడు అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డిఓ దేవేందర్‌ రెడ్డి, తహసిల్దార్‌ లత, ఎంపీపీ, గ్రామ సర్పంచ్‌ సుజాత, మాజీ ఎంపీపీ తానాజీ రావు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *