Breaking News

Monthly Archives: October 2019

రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడి అండ్‌ సిగార్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర రెండవ మహాసభలు నవంబర్‌ 3, 4 తేదీలలో నిజామాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్టు యూనియన్‌ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు పల్లపు వెంకటేష్‌ మాట్లాడారు. నవంబర్‌ 3, 4 తేదీలలో నిజామాబాద్‌ నగరంలో రాష్ట్ర మహా సభలు జరుగుతాయని, మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా 400 మంది డెలిగేట్స్‌ హాజరవుతారని అన్నారు. ప్రధానంగా ...

Read More »

ఉక్కు మనిషి సర్దార్‌ పటేల్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్ధార్‌ వల్లభయ్‌ పటేల్‌ విగ్రహానికి పులా మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణా రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామంలో అసమాన త్యాగాలు చేసిన సమర యోధుడు.. హైదరాబాద్‌ సంస్థానం ప్రజలకు నిజాం, రజాకార్ల పీడ నుంచి విముక్తి కలిగించిన ధీరుడు.. పటేల్‌ అన్నారు. 560కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం ...

Read More »

వ్యాధి బాధ భరించలేక ఆత్మహత్య

కామారెడ్డి, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టేక్రియాల్‌ గ్రామానికి చెందిన సుంకరి నరసింహులు (45) గత రెండేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో బాధను భరించుకోలేక బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఉరివేసుకొని ఆతహత్య చేసుకున్నాడు. మృతుని కుమారుడు సుంకరి నరేందర్‌ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Read More »

విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గురువారం బాల్కొండలో ‘జాతీయ సమైక్యత దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను నైపుణ్యాభివద్ధికై వైబ్రంట్స్‌ ఆఫ్‌ కలామ్‌ సంస్థ దత్తత తీసుకుంది. కార్యక్రమానికి జిల్లా ఇంటర్‌ మీడియేట్‌ విద్యాధికారి ఒడ్డెన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని ముందుకు సాగాలన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లా లో అన్ని కళాశాలల్లో ఏర్పాటు చేసి విద్యార్థులకు ...

Read More »

బీర్కూర్‌లో రాష్ట్రీయ ఎక్తా దివస్‌

బీర్కూర్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బీర్కూర్‌ గ్రామపంచాయతీలో జాతీయ ఐక్యత దినోత్సవం రాష్ట్రీయ ఏక్తా దివాస్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కేంద్ర సమాచార శాఖ భారత ప్రభుత్వం వారిచే నిజామాబాద్‌ ఫీల్డ్‌ పబ్లిసిట్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు గారిచే కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. కార్యక్రమంలో తెరాస పార్టీ ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, కస్తూర్బా పాఠశాల విద్యార్థినులు, ప్రజలు, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంగన్‌వాడి టీచర్లు, సూపర్‌ వైజర్‌, పోషన్‌ ...

Read More »

రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది

బాన్సువాడ, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం హాన్మాజిపెట్‌లో అకాల వర్షాలతో నష్టపోయిన మొక్కజొన్న, వరి పంటలను స్థానిక నాయకులతో కలిసి బాన్సువాడ ఎంపిపి దొడ్ల నీరజ వెంకట్‌ రాం రెడ్డి పరిశీలించారు. వారి వెంట జెడ్పీటిసి పద్మ గోపాల్‌ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని రైతులెవరు అధైర్యపడవద్దని ఎంపిపి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయసమితి అధ్యక్షులు అంజిరెడ్డి, మండల రైతు సమన్వయసమితి అధ్యక్షులు సంగ్రామ్‌ నాయక్‌, సర్పంచ్‌ సుభాష్‌, ఎంపీటీసీ ...

Read More »

అవినీతికి పాల్పడితే ఉక్కుపాదం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డులు శుద్ధీకరణలో అవినీతికి అక్రమాలకు పాల్పడితే ఉక్కుపాదం మోపుతామని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు హెచ్చరించారు. రైతులను ఇబ్బందికి గురి చేస్తే సహించేది లేదన్నారు. రికార్డు పెండింగ్‌ పెట్టవద్దని 100 శాతం రికార్డులు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. గురువారం ప్రగతి భవన్‌లో రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై నిజామాబాద్‌ డివిజన్‌ రెవెన్యూ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌తో ...

Read More »

బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా మారంపల్లి గంగాధర్‌

నందిపేట్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా మారంపల్లి గంగాధర్‌ నియమితులయ్యారు. గంగాధర్‌ నందిపేట మండలం మారంపల్లి గ్రామానికి చెందిన మాజీ వైస్‌ ఎంపీపీ. కాగా గురువారం బిజెపి జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి బిజెపి జిల్లా అధికార ప్రతినిధిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంగాధర్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని ప్రజా సేవలో ముందుంటానని అన్నారు.

Read More »

వరి ఆరబెట్టడంలో ఆదర్శం… నందిపేట రైతులు

నందిపేట్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల రైతులు వరిపంటను తమ పొలాల్లో కోసిన తర్వాత తేమను తొలగించడానికి ఆరబెట్టడంలో ఇతర గ్రామాల రైతులకు ఆదర్శంగా వుంటున్నారు. ఇతర గ్రామాల రైతులలాగా రోడ్లపై గాకుండా ఖాళీ ప్రదేశాల్లో ఆరబెట్టి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని ఖుదాన్పూర్‌ గ్రామం నుండి ఆర్మూర్‌ వరకు గల గ్రామాల రైతులు తమ పంట పొలాల్లోని వరిని రోడ్లపై ఆరబెట్టడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిదంగా జోజిపేట్‌ నుండి నిజామాబాద్‌ వరకు ...

Read More »

సర్దార్‌ పటేల్‌ మార్గంలో నడవడమే అసలైన నివాళి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఏ ఆశయాల కోసం జీవించారో వాటి సాధనకు మనం కషి చేయడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అవుతుందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. సర్దార్‌ పటేల్‌ 144వ జయంతిని పురస్కరించుకొని జిల్లా యంత్రాంగం, నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక పార్లమెంట్‌ సభ్యులు అరవింద్‌ ధర్మపురితో కలిసి ...

Read More »

ధ్వజస్తంభ పున: ప్రతిష్ట

బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలోని రామాలయంలో ధ్వజ స్థంబ పునప్రతిష్ట కార్యక్రమం బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు ఆలయంలోని పురాతన ధ్వజస్థంభం నేలకొరగడంతో నూతన ధ్వజస్తంబాన్ని పునప్రతిష్టించారు. ఆలయకమిటి ఆధ్వర్యంలో వేద పండితులు జపాల భాస్కర శర్మ హోమము జరిపించారు. కార్యక్రమంలో ఎంపిపి దొడ్ల నీరజ, వెంకట్‌ రాం రెడ్డి దంపతులు, గ్రామపెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read More »

నవంబర్‌ 3న దయానంద సరస్వతి బలిదాన దినోత్సవం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్యసమాజము-ఇందూరు ఆధ్వర్యంలో మహర్షి దయానంద సరస్వతి బలిదాన దినోత్సవము నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నవంబర్‌ 3వ తేదీ ఆదివారం కార్తీక శుక్ల సప్తమి రోజున సాయంత్రం 5.30 గంటల నుండి రాత్రి 7.30 వరకు ఆర్యసమాజ వైదిక సత్సంగ భవనంలో కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. సమాజ సభ్యులు, అభిమానులు హాజరుకావాలని కోరారు.

Read More »

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు హెచ్చరించారు. ఆర్మూర్‌ ఎంపీడీవో కార్యాలయంలో డివిజన్‌ రెవెన్యూ శాఖ ధాన్యం కొనుగోలు రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సమీక్ష సమావేశం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన వంద రోజుల్లో పూర్తిచేయాలని నిర్దేశించినందున వందకు వందశాతం రికార్డుల ప్రక్షాళన సంపూర్ణంగా పూర్తిచేయాలని, గతంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష సమావేశాలు ...

Read More »

అసమానతలు లేకుండా కలిసికట్టుగా ఉండాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ ప్రజలు ఏలాంటి అసమానతలు లేకుండా కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివద్ధి దిశలో ముందుకు తీసుకుపోవాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఆన్నారు. ఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామంలో రెవెన్యూ పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పౌరహక్కుల దినోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా గ్రామాభివద్ధికి ప్రణాళికలు చేసుకొని ప్రాధాన్యత క్రమంలో పనులను చేపట్టాలన్నారు. గత మూడు సంవత్సరాల నుండి ఏలాంటి ...

Read More »

అట్రాసిటీ కేసు నమోదు

రెంజల్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాటాపూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ రవిపై దాడికి పాల్పడిన సంఘటన స్థలాన్ని బోధన్‌ ఏసీపీ రఘు పరిశీలించారు. వివరాల్లోకి వెళితే సాటాపూర్‌ గ్రామానికి చెందిన జాదవ్‌ రవిపై అదే గ్రామానికి చెందిన అమనుల్లా అనే వ్యక్తితోపాటు పలువురు దాడి చేసిన సంఘటనపై విచారణ చేపట్టారు. గత నెల రోజుల క్రితం జాదవ్‌ రవి వద్ద 6 వేల రూపాయలను అమాన్‌ తీసుకోగా, వాటిని తిరిగి ఇవ్వమని అమాన్‌ ఇంటికి వెళ్లిన రవిపై దాడితో ...

Read More »

కూనేపల్లిలో సివిల్‌ రైట్స్‌ దినోత్సవం

రెంజల్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కూనేపల్లి గ్రామంలో సివిల్‌ రైట్స్‌ దినోత్సవాన్ని తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి చైతన్యవంతులను చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విజయ, ఆర్‌ఐ గంగాధర్‌, వైద్యాధికారి క్రిస్టినా, నాయకులు లింగం, సాయిలు, తదితరులు ఉన్నారు.

Read More »

శాసనసభ సభ్యునిగా సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం

బాన్సువాడ, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర శాసనసభలో సభ్యునిగా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సైదిరెడ్డితో అసెంబ్లీ లోని తన చాంబర్‌లో రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, శాసనసభ ఉప సభాపతి టి. పద్మారావు గౌడ్‌, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, మంత్రులు మహముద్‌ మహ్మద్‌ ఆలీ, గుంతకండ్ల జగదీశ్వర్‌ రెడ్డి, ...

Read More »

ప్రయాణీకులకు మౌలిక వసతులు కల్పించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ ఫారం నంబర్‌ 4, 5 లో ఆగే గూడ్స్‌ రైళ్లను జానకంపేట్‌ స్టేషన్‌కు తరలించి, ఆ స్థానంలో ప్యాసింజర్‌ రైళ్లు ఆగేలా చూడాలని నిజామాబాద్‌ ఎంపి అర్వింద్‌ రైల్వే అధికారులకు సూచించారు. అలా చేయడం ద్వారా ప్రస్తుతమున్న టెంపరరీ టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు పూర్తి స్థాయిలో పని చేస్తాయని అన్నారు. ఈ మేరకు ఎంపి అర్వింద్‌ బుధవారం నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. 2, 3 ప్లాట్‌ ...

Read More »

పచ్చని ఠాణ

నందిపేట్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ ఠాణను నందనవనంగా మార్చారు పోలీసులు. సాధారణంగా ఠాణాకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతారు, కానీ నందిపేట్‌ పోలిస్‌ ఠాణ అందుకు భిన్నంగా ఠాణకు వచ్చేవారికి ఆహ్లాదం పంచుతుంది. పోలీస్‌ ఠాణలో వివిధ రకాల మొక్కల పెంపకంతో పాటు నీడనిచ్చే చెట్లు, వివిధ రకాల పూల మొక్కలు దర్శనమిస్తాయి. చెట్లు ఏపుగా పెరగడంతో అన్ని కాలాల్లో పచ్చగా దర్శనమిస్తుంది. దాంతోపాటు తీగ జాతి మొక్కలను నాటి వాటిని అందంగా తీర్చిదిద్దారు. స్టేషన్‌ లోపల జామ, ...

Read More »

గోదావరిని పరిశీలించిన జాయింట్‌ కలెక్టర్‌

రెంజల్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత వారం రోజులుగా మహారాష్ట్ర ఎగువన కురిసిన భారీ వర్షాలతో వరదనీరు భారీగా చేరడంతో ఎగువన ఉన్న ప్రాజెక్టులు గైక్వాడ్‌, విష్ణుపురి గేట్లను విడుదల చేశారు. దీంతో దిగువన ఉన్న గోదావరి నది కొత్త కల సంతరించుకుంది. మంగళవారం కందకుర్తి గోదావరినది నీటి ప్రవాహాన్ని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, బోధన్‌ ఆర్డీవోతో కలిసి పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ గోదావరికి వరద ఉద్ధతి భారీగా రావడంతో దిగువ భాగాన ఉన్న గ్రామాల ప్రజలు ...

Read More »