Breaking News

బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 2వ తేదీ బుధవారం గ్రామస్థాయిలో నిర్వహించే బతుకమ్మ ఉత్సవాలకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ఒక ప్రకటనలో ఆదేశించారు. బతుకమ్మ ఉత్సవాలను 2వ తేదీన గ్రామాలలో, 4న మున్సిపాలిటీలలో, 6న జిల్లా కేంద్రంలో నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించినందున మహిళలకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.

బతుకమ్మలు ఆడే చోట లైటింగ్‌, నిమజ్జన ప్రాంతాల్లో లైటింగ్‌తో పాటు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిమజ్జనం సందర్భంగా చెరువులు, కుంటలు, ట్యాంకుల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమాల్లో మహిళలు ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను ధరించటానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. తద్వారా ఆకర్షణీయంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమాల్లో మహిళా సంఘాల సభ్యులు, మహిళా ఉద్యోగినులు, మహిళలు, ఆడపిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. గ్రామ స్థాయి ఆయా శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రత్యేక అధికారులు ప్రత్యేక చొరవ చూపించి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించాలని, కార్యక్రమం పూర్తయిన తర్వాత పరిసరాలను పరిశుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని కార్యదర్శులను ఆదేశించారు.

Check Also

డిమాండ్‌ ఉన్న పంటలు వేస్తే ఈజీగా అమ్ముకోవచ్చు…

ఆర్మూర్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ రైతు రాష్ట్రంలోని ఇతర ప్రాంత రైతుల‌కు ఆదర్శవంతంగా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *