Breaking News

ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు

రెంజల్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూల రంగులతో బతుకమ్మను పేర్చి పూజలు చేశారు.

అనంతరం బతుకమ్మ ఆటపాటలతో దాండియా ఆడారు. అంగన్‌వాడి టీచర్లు, ఎంపీపీ రజినీ, జడ్పీటీసీ విజయ, ఐసిడిఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రమీల, పంచాయతీ రాజ్‌ ఏఈ లిఖిత తీరొక్క పూలతో బతుకమ్మలను చేర్చి ఒకచోట ఉంచి బతుకమ్మ ఆడారు. బతుకమ్మలను గ్రామ శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో అంగన్‌వాడి కార్యకర్తలు సురేఖ, రాజ్యశ్రీ, భాగ్యలక్ష్మి, గంగామణి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *