Breaking News

గ్రామాల్లో తనిఖీ బందాలు ఎప్పుడైనా రావచ్చు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పనులను తనిఖీ చేయడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు ఎప్పుడైనా రావచ్చని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్థాయి డివిజన్‌ స్థాయి అధికారులతో మాట్లాడారు. 30 రోజుల ప్రణాళిక మరో నాలుగు రోజుల్లో పూర్తవుతున్నందున మిగిలి ఉన్న పనులన్నింటిని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి తెలిపినట్లుగా పనులను పరిశీలించడానికి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బందాలు ఎప్పుడైనా ఏ గ్రామానికైనా ఆకస్మికంగా తనిఖీకి వచ్చే అవకాశముందన్నారు. రికార్డులలో చూపిన దానికి క్షేత్రస్థాయిలో జరిగిన పనికి ఒకే రకమైన నివేదికలు చూపించాలని లేదంటే సంబంధిత అధికారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 30 రోజుల కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా గ్రామ మండల మున్సిపాలిటీ స్థాయిలలో పారిశుద్ధ్యం ఇతర కార్యక్రమాలు తప్పనిసరిగా కొనసాగించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున మిగతా శాఖలతో పాటు రెవెన్యూ అధికారులు కూడా వారి వంతు భాగస్వామ్యం నిర్వహించాలని ఆదేశించారు. అన్ని గ్రామాల ప్రవేశాలలో అవెన్యూ ప్లాంటేషన్‌ తప్పనిసరిగా అనిపించేలా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు మార్పు కనిపించాలని ఆయన తెలిపారు. డంపింగ్‌ యార్డుల వద్ద తప్ప చెత్త ఎక్కడ కూడా కనిపించవద్దని తెలిపారు.

మన జిల్లా విశాలమైనదని జిల్లాకు చెందిన ఎందరో ఇతర రాష్ట్రాలలో విదేశాల్లోనూ ఉంటున్నారని 30 రోజుల కార్యక్రమంలో వారి సహాయ సహకారాలు తీసుకొని వారి నుండి వస్తు, నగదు రూపేణా, యంత్రాల రూపేనా లేదా స్థల రూపేనా విరాళాలు సేకరించి గ్రామాల అభివద్ధికి వైకుంఠ ధామాలు, డంపింగ్‌ యార్డుల ఏర్పాటుకు ప్రయత్నం చేయాలని, అవసరమైతే వారి కుటుంబ సభ్యుల పేర్లను వాటికి పెట్టవచ్చని ఆయన సూచించారు.

పండుగలతో పాటు ప్రభుత్వ పరంగా పలు కార్యక్రమాలు గాంధీ జయంతి, బతుకమ్మ ఉత్సవాలు తదితర కార్యక్రమాలు ఉన్నందున అధికారులు ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌ క్వార్టర్స్‌ వదిలి వెళ్లవద్దని ఆదేశించారు. ఈ నెల 2న గ్రామస్థాయిలో బతుకమ్మ ఉత్సవాలు ఉన్నందున నీటిపారుదల, రెవెన్యూ, పంచాయతీ రాజ్‌ శాఖల అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

భూముల క్రమబద్ధీకరణ ఇంకా ఎంత మాత్రం పెండింగ్‌ లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అటవీ-రెవిన్యూ శాఖల మధ్య గల భూములకు సంబంధించి రికన్సిలేషన్‌ పూర్తిచేయాలని తెలిపారు. ఈ నెల 2న జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం ఒకసారి ఉపయోగించే ఇతర నిషేధ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని ఈ దిశగా అధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా పరిషత్‌ సీఈవో గోవిందు, జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ, డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, జిల్లా పరిషత్‌ ఏవో కష్ణమూర్తి, ఆర్‌డివోలు గోపి రామ్‌, శ్రీనివాస్‌, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ బాబురావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *