Breaking News

పెద్దలను ఆదరించడం అందరి బాధ్యత

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వయసు మీద పడి ఒకరి పైన ఆధారపడిన పెద్దలను ఆదరించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అది ధర్మం కూడా అని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. వయోవద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ – ఆర్‌బివిఆర్‌ఆర్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ముబారక్‌ నగర్‌ ఆలంబన ఆశ్రమంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మన తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు బాధలు అనుభవించి ఎంతో శ్రమించి వారు సుఖాలు అనుభవించ కుండా పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసి వారి బాగు కోసం తమ సర్వస్వం ధారపోస్తారన్నారు. కానీ కొందరు పిల్లలు మాత్రం అవన్నీ మర్చిపోయి తల్లిదండ్రుల వద్ధాప్యంలో వారిని సరిగా చూడకుండా వారి ఆలనా పాలనా పట్టించుకోకుండా అశ్రద్ధ చేస్తారని, అది ఏవిధంగా చూసినా ఎంత మాత్రం క్షంతవ్యం కాదని దానిని ఒక పాపంగా, ఒక నేరంగా కూడా పరిగణించవలసి ఉంటుందన్నారు.

ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రులను వారిపై ఆధారపడిన ఇతర పెద్దలను ఏ ఆధారం లేని అనాధలను చేరదీసి వారికి అవసరమైన సేవలందించి ప్రేమతో చూసుకోవాలని కోరారు. దేశంలో వద్ధుల సంఖ్య అంచనా సుమారుగా 13 కోట్లని తెలిపారు. ఆలంబన గహంలో ఉంటున్న పెద్దలు తమ పిల్లలు దూరంగా ఉండడం చేత కానీ లేదా పట్టించుకోకపోవడం చేతగాని ఏ కారణంగా ఉంటున్నప్పటికీ వారికి ఇక్కడ లభిస్తున్న ప్రేమాభిమానాలు, సేవ, సదుపాయాలు బాగా సమకూర్చడంపై ఆయన యాజమాన్యాన్ని అభినందించారు.

అయితే ఆర్థికంగా డబ్బు చెల్లించలేని పేదలను కూడా ఈ గహంలో చేర్చుకొని మరింత సేవా భావంతో ఆదరించాలని ఆయన సూచించారు. ఇక్కడున్న వారంతా పెద్దవారిని జిల్లా అభివద్ధికి జిల్లాకు మంచి జరగడానికి తమ ఆశీస్సులు అందించాలని ప్రార్థించారు. పేదల కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు సంఘాలు కూడా నిర్వహిస్తే అవి బాగా పనిచేయడానికి వీలవుతుందని తెలిపారు.

ఇక్కడ ఉండే పెద్దలు ఎవరైనా ఆసరా పెన్షన్‌కు అర్హత కలిగి ఉంటే అందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీరికి రెగ్యులర్‌ గా వైద్య సేవలు ఉచితంగా మందులు అందించడానికి కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వద్ధులకు వేరుగా ఒక వార్డును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆ దిశగా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

దినోత్సవం సందర్భంగా ఆశ్రమములో నిర్వహించిన వివిధ రకాల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుదర్శనం, సొసైటీ చైర్మన్‌ జగదీశ్వర్‌రెడ్డి, అధ్యక్షుడు రమేష్‌ రెడ్డి, కార్యదర్శి ప్రవీణ్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

27న మాస్కుల‌ పంపిణీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెరాస పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *