Breaking News

కుల రహిత సమాజానికై అడుగులు వేద్దాం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు అడుగులు వేయాలని ఐఎఫ్‌టియు నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసు కోరారు.

సోమవారం రాత్రి మామిడిపల్లిలో జరిగిన కులనిర్మూలన చైతన్య సదస్సులో దాసు పాల్గొని ప్రసంగించారు. జ్యోతిబా పూలే సత్యశోధక సంస్థ 147వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనమంతా దేశంలో కుల సమస్యతో ఎందుకు ఇంక బాధపడుతున్నామనే విషయాన్ని తెలుసుకోవలసిన అవసరముందన్నారు.

కేంద్ర, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలన్నీ బ్రాహ్మణ భావజాలంతో పరిపాలన కొనసాగించడం వల్లనే కుల వ్యవస్థ కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బారతదేశం లౌకిక రాజ్యమని ప్రకటించాక కూడ దేశంలో కుల, మత ఘర్షణలు ఆగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ దేశంలో కుల నిర్మూలన జరగాలంటే కులాంతర పెళ్లిళ్లు ప్రభుత్వం ప్రోత్సహించాలని సూచించారని, కుల వివక్షత నేరమని చట్టాలు ఘోషిస్తున్నా కుల దురహంకార హత్యలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.

వర్ణ వ్యవస్థపై శాస్త్రీయ అవగాహనను పాఠశాలలో విద్యార్థులకు బోధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కుల మతాల ఎత్తులు దోపిడీ వర్గాల జిత్తులు అని ప్రజలు గ్రహించాలని దాసు సూచించారు. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా శ్రామిక జనులు ఐక్యంగా ఉద్యమించి కులరహిత సమాజంకై ఉద్యమించాలని దాసు ప్రజల్ని కోరారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు శివాజీ మాట్లాడుతూ దేశంలో 3,600 కులాలు ఉన్నట్లు, ఒక కులం మరొక కులాన్ని తక్కువ అనే భావంతో చూస్తున్నట్లు మన దేశ చరిత్ర నిరూపిస్తుందన్నారు.

అంటరానితనం మహానేరమని చట్టాలు కాగితాలకే పరిమితమె ౖఅనేక సమస్యల్ని సష్టిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలో ప్రజల మధ్య కుల మతవైషమ్యాలు పాలకులు రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ, కేసీఆర్‌ అప్పుల కుప్పలను ప్రజల నెత్తిన ఎత్తినారని ఆయన అన్నారు.

మెరుగైన సమాజం కోసం పోరాటం తప్ప మార్గం లేదని స్పష్టం చేశారు. సదస్సులో అరుణోదయ కార్యదర్శి సురేష్‌ బాబు, లక్ష్మణ్‌, ఐఎఫ్‌టియు నాయకులు ఎస్‌.మారుతి, సిద్దయ్య, మగ్దూం పటేల్‌, పివైఎల్‌ నాయకులు వెంకటేష్‌, నజీర్‌, రవి, వార్డ్‌ మెంబర్‌ మోయిన్‌, అజీమ్‌, మహిళా సంఘం నాయకులు మహమ్మది, హైమదక్క, లలిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఉచిత బియ్యం పంపిణీ చేసిన ఎంపిటిసి రాణి

నందిపేట్‌, మే 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నుంచి రెండవ విడత ఉచిత బియ్యం పంపిణీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *