Breaking News

తూతూమంత్రంగా మండల సర్వసభ్య సమావేశం

రెంజల్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం మండల పరిషత్‌ అధ్యక్షురాలు లోలపు రజినీ అధ్యక్షతన నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం తూతూ మంత్రంగా సాగింది. ప్రధాన శాఖల అంశాలను పరిగణనలోకి తీసుకుని మిగతా శాఖలను కొనసాగించకుండానే సమావేశం ముగించారు. వ్యవసాయ శాఖ, ట్రాన్స్‌కో, ఆర్‌డబ్ల్యుఎస్‌, రెవెన్యూ శాఖల అధికారుల పనితీరుపై సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే అధికారులు కార్యాలయాలకే పరిమితమవ్వడంతో గ్రామాల్లో పాలన కుంటుపడుతుందని సభ్యులు అదికారులను నిలదీశారు. గ్రామాల్లో పర్యటించి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని సూచించారు.

30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలాన్ని ప్లాస్టిక్‌ రహిత మండలంగా తీర్చిదిద్దాలని పాలకవర్గం ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ, వైఎస్‌ ఎంపిపి యోగేష్‌, తహసీల్దార్‌ అసదుల్లా ఖాన్‌, ఎంపిడివో గోపాలకష్ణ, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపిటిసిలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *