Breaking News

5లోపు జీతాలివ్వాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల జీతాలు ఇవ్వాలని కోరుతూ సూపరింటెండెంట్‌ అజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్‌ యూనియన్‌ (ఏఐటియుసి) అను బంధ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్‌, దోమకొండ ఆసుపత్రుల కార్మికులకు గత 2 నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ విషయమై జిల్లా అధికారుల స్పందన లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులకు జీతాలు లేక అద్దెలు, పిల్లల ఫీజులు కట్టలేక అప్పులు తెచ్చుకొని నానా ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే కార్మికుల జీతాలు అడిగితే కాంట్రాక్టర్‌, ప్రభుత్వం బడ్జెట్‌ లేదని చేతులు దులుపుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

5వ తేదీలోపు కార్మికులకు జీతాలివ్వకుంటే నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో బాలరాజు, నరేశ్‌, ప్రవీణ్‌, నరేశ్‌ తదితరులున్నారు.

Check Also

జాకోరాలో సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి

బాన్సువాడ, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 17వ రోజు వర్ని మండలం జాకోరా గ్రామంలో జహీరాబాద్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *