Breaking News

ట్రీ గార్డులకు సపోర్టు ఏర్పాటు చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొక్కల రక్షణకు ఏర్పాటు చేసే ట్రీ గార్డులు పడిపోకుండా వాటికి సపోర్టు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అధికారులను ఆదేశించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేస్తున్నారని అయితే అవి గాలికి పడిపోకుండా కట్టెలతో సపోర్టు ఏర్పాటు చేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు.

మంగళవారం నాడు ఆయన ముబారక్‌నగర్‌ ప్రాంతంలో పర్యటించి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపల్‌ అధికారులతో మాట్లాడుతూ బైపాస్‌ రోడ్డు నుండి మున్సిపల్‌ పరిధిలో చివరివరకు మీడియం, అవెన్యూ ప్లాంటేషన్‌కు తప్పనిసరిగా రక్షణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఎక్కడ కూడా మురుగునీరు నిలువ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడ కూడా ప్లాస్టిక్‌ కనిపించకుండా శుభ్రం చేయాలని పేర్కొన్నారు. పనులన్నీ మిషన్‌ మోడ్‌లో నిర్వహించాలని కార్యక్రమాలు పక్కాగా జరగాలని ఇక్కడ కూడా మురుగునీరు అపరిశుభ్రత కనిపించవని ఆయన అధికారులకు స్పష్టంగా చెప్పారు. రోడ్లపైన ఇతరత్రా ఎక్కడపడితే అక్కడ చెత్తను ప్లాస్టిక్‌ ను పడవేసే వారిని గుర్తించాలని, ఒకసారి చెప్పి అయినా వినకుంటే జరిమానా విధించాలని తెలుపుతూ స్వచ్ఛ నిజామాబాద్‌కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

ప్లాస్టిక్‌ రహిత సమాజం నిర్మించడానికి కాలుష్యాన్ని పారద్రోలడానికి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తద్వారా భవిష్యత్‌ తరాలు కాలుష్యం కోరలకు బలి కాకుండా సహకరించిన వారమవుతామని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌ వెంట మున్సిపల్‌ సహాయ ఇంజనీర్‌ ఇనాయత్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *