Breaking News

బతుకమ్మ చీరల పంపిణీ

రెంజల్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు అందించిన బతుకమ్మ చీరలను బుధవారం అంబేద్కర్‌ నగర్‌లో సర్పంచ్‌ మతురాబాయి, తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, ఎంపీడీవో గోపాలక ష్ణ మహిళలకు అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిచెప్పేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కషి చేశారని, ప్రతి ఆడబిడ్డకు బతుకమ్మ పండుగ కానుకగా ప్రతి ఏడాది చీరలను అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పంచాయతీ అధికారి గౌస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ గంగాసాగర్‌, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, టిఆర్‌ఎస్‌ నాయకులు రఫిక్‌, వసంత్‌ కాంబ్లే, సాయగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *