Breaking News

తులసీ ట్రస్టు ఆధ్వర్యంలో స్వచ్చ సర్వేక్షన్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం తులసి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నాగారం లోని శ్రీనివాస సిద్ధార్థ నగర్‌లో స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ కమ్యూనిటీ హాల్‌లో ఏర్పాటుచేసిన సమావేశానికి జిపిఎస్‌ జెండాగల్లి ప్రధానోపాధ్యాయుడు రాంచందర్‌ గైక్వాడ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

2014లో ప్రవేశపెట్టిన స్వచ్ఛ సర్వేక్షన్‌ కార్యక్రమంలో అందరు భాగస్వాములై విజయవంతం చేయాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ప్రధాన వీధుల గుండా విద్యార్థులు దళిత కళ్యాణ్‌ సమితి సభ్యులు తులసి ట్రస్ట్‌ సభ్యులు కలిసి ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ ద్వారా స్వచ్ఛభారత్‌ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తులసి ట్రస్ట్‌ ప్రతినిధి గంగాధర్‌ కళ్యాణ్‌ సమితి అధ్యక్షులు భీమ్‌రావు, దావని ఎస్‌ఎంసి మాజీ చైర్మన్‌ బాబురావు, సమత, సైనిక్‌ దళ్‌ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

జూన్‌ 1 నుండి ప్రత్యేక పారిశుద్య కార్యక్రమం

నిజామాబాద్‌, మే 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా జూన్‌ 1 వ తేదీ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *