Breaking News

అంతరిక్ష ప్రదర్శన సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ స్పేస్‌ వీక్‌ సందర్భంగా ఈ నెల నాలుగు నుండి ఆరవ తేదీ వరకు స్థానిక నిర్మల హదయ పాఠశాలలో స్పేస్‌ వీక్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలతో అంతరిక్ష ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ప్రజాసైన్స్‌ వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గన్‌పూర్‌ వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు కస్తూరి గంగా కిషన్‌ ప్రధాన కార్యదర్శి సుశీల్‌ కుమార్‌ ఉపాధ్యక్షులు రాంచందర్‌ గైక్వాడ్‌ గణిత ఫోరం ప్రధాన కార్యదర్శి కాంతారావులు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలు అంతరిక్ష వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించడం జిల్లాకే గర్వకారణమన్నారు. ప్రదర్శనలకు సంబంధించి కరపత్రాలు, పోస్టర్లను ఇస్రో సైంటిస్టులు సుమన్‌, సౌమ్య గుప్త లతో కలిసి ప్రజాసైన్స్‌ వేదిక ఆధ్వర్యంలో బుధవారం మోడ్రన్‌ స్కూల్‌లో ఆవిష్కరించారు.

ఈ నెల 4న శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌చే అంతరిక్ష ప్రదర్శన ప్రారంభమవుతుందని 40 రకాల మోడల్స్‌తో పాటు షార్ట్‌ ఫిల్మ్‌ను ఇస్రో సైంటిస్ట్‌లు ప్రదర్శిస్తారని ప్రజాసైన్స్‌ వేదిక ప్రతినిధులు తెలిపారు. జిల్లాలోని కళాశాల, పాఠశాల విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, పౌరులు ప్రతి ఒక్కరు అంతరిక్ష ప్రదర్శనలను సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *