Breaking News

30 రోజుల ప్రణాళిక ఆరంభం మాత్రమే

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల ప్రవేశం వద్ద చెత్తకుప్పలతో లేకుండా పచ్చదనంతో ఆహ్వానం పలకాలని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా డిచ్‌పల్లి మండలంలోని నడికుడలో స్వచ్ఛ సంరక్షణ గ్రామీన్‌ కార్యక్రమంలో భాగంగా స్వచ్చతాహి సేవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూల మాలలు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ చూపించిన మార్గంలో నడిచినప్పుడే నిజమైన నివాళులు అన్నారు. ఇంటిని, పరిసరాలను, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచితే దేశ ప్రగతికి పాటుపడిన వారమవుతామని, ఈ విషయంలో మహిళల కషి ఎంతో అవసరమన్నారు. ఏళ్ళ తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని ప్రతిరోజు గ్రామాలలో పరిశుభ్రతను పాటించాలని చెప్పారు.

30 రోజుల ప్రత్యేక ప్రణాళికలు కార్యక్రమం ముగియదని ఇది ఆరంభం మాత్రమేనని నిరంతరంగా కొనసాగించాలన్నారు. ప్రత్యేక ప్రణాళికలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధుల కషితో ప్రజల భాగస్వామ్యంతో కొంత మార్పు కనబడుతుందని, మరో ఏడాది వరకు మరింత మార్పు చెందాలన్నారు. ప్లాస్టిక్‌ వలన పశువులు మనుషులకు ఇబ్బందులు ఎదురవడంతో పాటు పర్యావరణ సమతుల్యం లేకుండా చేస్తుందని, ప్లాస్టిక్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని చెప్పారు.

గ్రామాల్లో సేకరించిన చెత్తను మండల వారీగా నిలువ చేసి అక్కడి నుండి జిల్లా కేంద్రానికి తరలించిన తర్వాత రీసైక్లింగ్‌ చేయించడం జరుగుతుందని, పచ్చదనం పరిశుభ్రతపై గ్రామాలు ఆరోగ్యకరమైన పోటీతో ముందుకుపోవాలని అన్నారు. పరిసరాల శుభ్రత పచ్చదనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. మహిళలు శ్రద్ధ వహిస్తే ఏదైనా సాధించవచ్చునని, వ్యాపార వాణిజ్య దారులకు ముందుగా అవగాహన కల్పించి నిర్దేశించిన ప్రదేశాలలో చెత్తను వేయని పక్షంలో జరిమానా విధించడంతో పాటు, అవసరమైతే కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని కలెక్టర్‌ హెచ్చరించారు.

గ్రామాల్లో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డ్‌లో వేయాలని చెప్పారు. ఇతర ప్రాంతం నుండి వచ్చిన ప్రజలు చూసి సంతోష పడితే అదే మీకు సర్టిఫికెట్‌ అని ఎవరు ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటించేందుకు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మహిళలచే ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ రమేష్‌ రాథోడ్‌, ఎంపీడీవో సురేందర్‌, ఎంపీపీ భూమన్న, సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *