Breaking News

మహాత్ముడి ఆశయసాధనకు కషిచేయాలి

రెంజల్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్ముని బాటలో ప్రయాణించి ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు చేయాలని సర్పంచ్‌ సునీత అన్నారు. మహాత్మా గాంధీ 150 వ జయంతి సందర్భంగా మండలంలోని మౌలాలి తండాలో సర్పంచ్‌ సునీత మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మహాత్ముడు చూపిన బాటలోనే ప్రతి ఒక్కరు ప్రయాణించి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని, గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటం వద్ద తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని పల్లె ప్రగతికి కషి చేస్తామని పాలకవర్గం చేత ప్రతిజ్ఞ చేయించారు.

30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ రవి, ఎంపీటీసీ లక్ష్మీ, రైసస జిల్లా సభ్యుడు మౌలానా, మాజీ సర్పంచ్‌ శంకర్‌, బాబునాయక్‌, అన్వర్‌, లింగారెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

మండలంలోని 17 గ్రామపంచాయతీలో సర్పంచ్‌లు, ప్రభుత్వ కార్యాలయాల్లో మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌ అసాదుల్లా ఖాన్‌, మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రజినీ, మండల అభివద్ధి అధికారి గోపాలకష్ణ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *