Breaking News

స్వచ్చతాహి సేవా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మ గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్లాస్టిక్‌ నిర్మూలన అవగాహన కార్యక్రమంలో భాగంగా నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతహి సేవా ర్యాలీని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ నిర్మూలనకు మహిళల కషి సహకారం అవసరమని, స్వచ్ఛ నిజామాబాద్‌లో భాగంగా ప్లాస్టిక్‌ లేని నగరంగా చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని కలెక్టర్‌ అన్నారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్‌ జాన్‌ సాంసంన్‌, మెప్మా పిడి రాములు, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. నగర పాలక సంస్థ నుండి ప్రారంభమైన ర్యాలీ తిలక్‌ రోడ్‌, బస్టాండ్‌ మీదుగా గాంధీ చౌక్‌ వరకు నిర్వహించారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *