Breaking News

ప్రభుత్వ పథకాల నిధులు క్రింది స్థాయికి చేరే విధంగా కషి చేద్దాం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదల చేసే నిధులు క్రింది స్థాయి వరకు చేరే విధంగా అందరం ఐకమత్యంతో కషి చేద్దామని నిజామాబాద్‌ లోక్‌సభ సభ్యులు, జిల్లా అభివద్ధి, సమన్వయ మరియు మానిటరింగ్‌ (దిశ) కమిటీ చైర్మన్‌ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాల పనితీరుపై జిల్లా అభివద్ధి సమన్వయ మరియు మానిటరింగ్‌ కమిటీ సమావేశాన్ని పార్లమెంటు సభ్యుల అధ్యక్షతన ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా ఆయన ముందుగా ప్రజలకు నవరాత్రి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు, అధికారులతో మాట్లాడుతూ, మనమంతా ఏ పార్టీకి సంబంధించిన వారం అయినప్పటికీ కూడా ప్రజాసేవే పరమావధిగా కలసికట్టుగా ప్రజల కోసం పని చేద్దామని తెలిపారు. ఏం చేస్తే ప్రజలకు బాగా సేవ చేయగలమో, నిధుల వినియోగం ఏ విధంగా సద్వినియోగం చేయగలమో ఆలోచించాలని, ఆ విధంగా నిర్ణయం తీసుకుందామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్‌, ఉపాధిహామీ పథకాలతో పాటు అన్ని పథకాలు కూడా మరింత అభివద్ధి జరిగే విధంగా ముందుకు వెళతామని ఆయన తెలిపారు. మంచి పనులు నిర్వహించి గ్రామాలకు, తద్వారా జిల్లా స్థాయి వరకు మార్పు కనిపించే విధంగా చూద్దామన్నారు. సాధారణంగా సమీక్ష సమావేశం సంవత్సరంలో కనీసం నాలుగు సార్లు నిర్వహించాలని ఉన్నప్పటికీ పథకాలు అన్నింటిని లోతుగా సమీక్షించడానికి ముందుగా నెలకొకసారి సమీక్షించుకుందామని ఆయన తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరే విధంగా తద్వారా అన్ని గ్రామ పంచాయతీలకు సమానంగా అభివద్ధి పనులకు అవసరమైన నిధులు వచ్చే విధంగా కషి చేద్దామన్నారు. పార్టీలకతీతంగా ఎటువంటి రాజకీయాలకు తావులేకుండా అందరం కలిసి అభివద్ధికి బాటలు వేద్దామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా హాజరైన సభ్యులు మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలకు గౌరవ వేతనం పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపర్చాలని, అంగన్‌వాడి కేంద్రాలలో పిల్లలకు, తల్లులకు గర్భిణీలకు సరైన పద్ధతిలో పోషకాహారం అందే విధంగా చూడాలని, మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందివ్వాలని, ఫుడ్‌ సెక్యూరిటీ పథకం కింద పెండింగ్లో ఉన్న దరఖాస్తుదారులకు తెల్ల రేషన్‌ కార్డులు జారీ చేయాలని కోరారు. ఈ సందర్భంగా సమగ్ర శిశు అభియాన్‌, బేటి బచావో – బేటి పడావో, అమత్‌, ఫుడ్‌ సెక్యూరిటీ తదితర కార్యక్రమాలపై సమీక్షించారు.

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా 41 పథకాలు దేశంలో అమలు జరుగుతున్నాయని మన జిల్లాలో 33 పథకాలను అమలు చేస్తున్నామన్నారు. పద్నాలుగవ ఆర్థిక సంఘం నిధుల ద్వారా గ్రామ పంచాయతీలకు జనాభాకు అనుగుణంగా ఒక్క వ్యక్తికి 14 వందల రూపాయల నిధులను ఆయా గ్రామ పంచాయతీలకు వస్తాయని వాటితో పాటు డొనేషన్లు, గ్రామపంచాయతీ నిధులను ప్రణాళిక చేసుకొని అభివ ద్ధి పనులు నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో గ్రామం యూనిట్‌గా పనులను చేపట్టడానికి నిధులను నేరుగా గ్రామాలకు పంపించడానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి కమిటీ తీర్మానంలో ఆమోదం తెలిపారు. సమావేశ అనంతరం గురువారం చనిపోయిన నిజామాబాద్‌ రూరల్‌ తహసిల్దార్‌ జ్వాల గిరి రావు ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలుపుతూ కొద్దిసేపు మౌనం పాటించారు. కమిటీ సమావేశంలో డిఆర్‌డివో రమేష్‌ రాథోడ్‌, జిల్లా అధికారులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆర్థిక ప్యాకేజీతో అన్ని వర్గాల‌కు ఊరట…

నిజామాబాద్‌, మే 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ నగర శాఖ ఆధ్వర్యంలో ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *