Breaking News

శిక్షావర్గను సందర్శించిన ఎంపి అర్వింద్‌

రెంజల్‌, అక్టోబర్‌ 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ పాఠశాలలో గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఆరెస్సెస్‌ ప్రాథమిక శిక్షావర్గ శిక్షణా తరగతులను నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ గురువారం పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చి శిక్షణ పొందుతున్న శిక్షార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

భారతమాత ముద్దు బిడ్డలైన యువకులు దేశసేవే దేవుని సేవగా ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహిస్తున్న ప్రాథమిక శిక్షావర్గ రెంజల్‌లో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బస్వా లక్ష్మీనర్సయ్య, మండల అధ్యక్షుడు మేక సంతోష్‌, కిషోర్‌, వెంకటేశ్వరరావు, గోపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Check Also

మండల‌ జర్నలిస్టుల‌ కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాయంలో జర్నలిస్టుల‌ సమావేశం ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *