Breaking News

పిట్లంలో అట్ల బతుకమ్మ వేడుకలు

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ నియోజక వర్గంలోని పిట్లం మండలంలో తెలంగాణ జాగతి కన్వీనర్‌ అనిత సింగ్‌ ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే తనయుడు హరీష్‌ షిండే పాల్గొని బతుకమ్మ ఆడి అందరిని ఆకట్టుకున్నారు.

రంగు రంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆట పాటలతో వేడుకలు నిర్వహించారు. హరీష్‌ షిండే మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మ ఒక భాగమని, సంప్రదాయబద్దంగా, భక్తి, శ్రద్దలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా కన్వీనర్‌ బాలరాజ్‌, ఎంపిపి కవిత విజయ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ సుధాకర్‌రావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యువత పాజిటివ్‌ దక్పథాన్ని అలవర్చుకోవాలని సమాచార శాఖ డిప్యుటి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *