Breaking News

ఆటో, ఆర్టీసి బస్సు ఢీ – ఇద్దరు మృతి

కామారెడ్డి, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం ఉగ్రవాయి స్టేజి వద్ద కరీంనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామరెడ్డి వస్తున్న ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘనపూర్‌కు చెందిన భూక్య రవి (40), పాల్వంచకు చెందిన రజియా (35) అక్కడికక్కడే మతి చెందారు.

కరీంనగర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి కరీంనగర్‌ వెళ్తుండగా ఉగ్రవాయి స్టేజి వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జయింది. ఆటోడ్రైవర్‌ బుక్యా రవి, ఆటోలో ప్రయాణిస్తున్న పాల్వంచ చెందిన రజియా సంఘటన స్థలంలోనే మృత్యువాత పడ్డారు.

మరో మహిళా ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. మతి చెందిన రవి, రజియా లను కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన పాల్వంచకు చెందిన మరో మహిళను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *