Breaking News

విజేతలకు నగదు బహుమతులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బతుకమ్మ సంబరాల సందర్భంగా జిల్లా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 5 వ తేదీన కలెక్టర్‌ గ్రౌండ్‌లో నిర్వహించే ముగ్గుల పోటీలకు నగదు బహుమతులను అందజేయడం జరుగుతుందని జిల్లా సమాచార శాఖ ఉపసంచాలకులు మమ్మద్‌ ముర్తుజా తెలిపారు.

పోటీల్లో పాల్గొని ప్రధమ ద్వితీయ, తతీయ బహుమతులు గెలుపొందిన వారికి 5000, 3000, 2000 రూపాయల చొప్పున నగదు బహుమతులను అందజేయడం జరుగుతుందని చెప్పారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారందరికీ జ్ఞాపిక అందజేయడం జరుగుతుందని చెప్పారు. ముగ్గుల పోటీలో పాల్గొను ఆసక్తిగలవారు శనివారం ఉదయం 8 గంటలకు కలెక్టర్‌ గ్రౌండ్‌లో లేదా కార్యాలయం సీనియర్‌ అసిస్టెంట్‌ను ఫోన్‌లో 9912777155 సంప్రదించవచ్చన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *