Breaking News

దుర్గామాతకు కుంకుమార్చనలు

కామారెడ్డి, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచ్‌రాస్తాలో శివసేన దుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత మండపం వద్ద శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

అంతేకాకుండా అమ్మవారిని కూరగాయలతో అలంకరించారు. భక్తులకు అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతినిధులు జేపీ సచిన్‌ మాట్లాడుతూ శివసేన దుర్గా సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత మండపం వద్ద ప్రతి రోజు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించటం జరుగుతుందన్నారు.

అలాగే శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సుతారి శ్రీనివాస్‌, భాస్కర్‌, చింటూ, విక్రమ్‌ మధు, నందు పాల్గొన్నారు.

Check Also

రైతుల‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు.

కామారెడ్డి, మే 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న నియంత్రిత వ్యవసాయం గురించి తమకు ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *