Breaking News

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

నిజాంసాగర్‌, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర టీయూ డబ్ల్యూజె కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు లతీఫ్‌ ఆదేశానుసారం కౌన్సిల్‌ మెంబర్‌ సంగాయప్ప ఆధ్వర్యంలో బాన్సువాడ ఆర్డీఓ రాజేశ్వర్‌కు డివిజన్‌ స్థాయి విలేకర్లు వినతి పత్రం అందించారు. రాష్ట్ర జర్నలిస్టుల సంఘం తెలంగాణ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ (ఐజెయు) ఆదేశానుసారం రాష్ట్రంలోని అన్ని డివిజన్‌ స్థాయిలో శుక్రవారం ఆర్డీఓలకు జర్నలిస్టులు వినతి పత్రం అందించారు.

రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు ముఖ్య మంత్రి కేసీఆర్‌ దష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా సహకారం అందించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు అన్ని రకాలుగా సహకారం అందించారని స్వయంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్‌ పలు సభలలో, పలు సందర్భాల్లో వ్యక్తపర్చడం జరిగిందని, తక్షణమే సిఎం కెసిఆర్‌ జర్నలిస్టుల కోసం డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఇవ్వాలని, కార్పొరేట్‌, ప్రవేటు ఆసుపత్రులలో మెరుగైన వైద్యం కొరకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్‌ కార్డులు జారిచేయాలని, జీవో నంబర్‌ 239 రద్దు చేసి అందరికి అక్రెడిషన్‌, హెల్త్‌ కార్డు, మెరుగైన వైద్యం కొరకు కార్పొరేట్‌ ఆసుపత్రులలో వైద్య సేవలు కల్పించాలని కోరారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రవేటు పాఠశాలలో కానీ కార్పొరేట్‌ కళాశాలలో పూర్తి స్థాయి ఫీజ్‌ మినహాయించి పిల్లలకు మెరుగైన విద్య అందేటట్లు సహకారం అందించాలని కోరారు.

2014 ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పొందు పర్చిన మేనిఫెస్టోలో, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు పర్చి జర్నలిస్టుల అభివద్ధికి సహకారం అందించాలని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో అఫ్సర్‌, కర్రేవార్‌ బాలాజీ, నాగేష్‌ గౌడ్‌, వెంకటరమణ, ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి దస్తా గౌడ్‌, తదితరులున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *