Breaking News

ఇచ్చిన హమీలు అమలు చేయాలి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలని, 239 జీ వో రద్దుచేసి జర్నలిస్టులందరికి అక్రిడిటేషన్లు ఇవ్వాలని టియుడబ్ల్యుజె నిజామాబాద్‌ జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణ కేంద్రంలోని జర్నలిస్టులు శుక్రవారం ఉదయం అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి టీయూడబ్ల్యూజే, ఐజేయూ డివిజన్‌ స్థాయి జర్నలిస్టుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.

అక్కడి నుండి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఆర్డీఓకు తమ సమస్యలు వివరించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఇళ్ళు.. ఇళ్ళ స్థలాలు సమకూర్చాలని, అందరికీ హెల్త్‌ కార్డులు జారీ చేసి అన్ని కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో వాటిని అంగీకరించి చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

అలాగే అక్టోబరు 14న జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా, జిల్లా కలెక్టరుకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి అజీమ్‌, కార్యవర్గ సభ్యులు రాజ్‌ కుమార్‌, మురళి సీనియర్‌ జర్నలిస్టు గోపి, స్వామి, నందిపేట్‌ అశోక్‌, స్వామి, నరేందర్‌, విన్సెంట్‌, జ్ఞానేశ్వర్‌, సందీప్‌, రాజేష్‌, మహోహార్‌, పురుషోత్తం, అశోక్‌ పాల్గొన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *