Breaking News

Daily Archives: October 6, 2019

మహిళల ఐకమత్యానికి ప్రతీక బతుకమ్మ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలందరూ ఒకచోట చేరి సంతోషంగా జరుపుకునే ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ మైదానంలో జిల్లాస్థాయి సద్దుల బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాలకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, స్థానిక శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, ఎమ్మెల్సీ వి.జి. గౌడ్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్‌ సతీమణితో కలిసి బతుకమ్మ పూజ చేశారు. ...

Read More »

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల జీతాలు ఇవ్వాలని ఆసుపత్రి ముందు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. రెండోరోజు ఆదివారం ఆసుపత్రి ముందు ధర్నా అనంతరం మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు (ఏఐటియుసి) ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్‌, దోమకొండ, ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు అందక ...

Read More »

పేకాటరాయుళ్ళ అడ్డా…

నందిపేట్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వం సాంకేతిక కళాశాల పేకాట రాయుళ్లు, ఆకతాయిలకు అడ్డాగా మారింది. వివరాల్లోకి వెళ్తే నందిపేట మండలకేంద్రంలోని ప్రభుత్వ సాంకేతిక కళాశాల గతంలో బాలికల హాస్టల్‌ కోసం భవన నిర్మాణం చేపట్టారు. అప్పట్లో ప్రభుత్వ సాంకేతిక కళాశాలకు భవనం లేనందున కొన్నిరోజుల పాటు ఉపయోగంలోకి తీసుకున్నారు. తర్వాత కళాశాలకు నూతన భవనం నిర్మాణం పూర్తి కాగానే అందులోకి మార్చుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది కాని… నాడు బాలికల హాస్టల్‌ కోసం ...

Read More »

పిడుగుపాటుకు ఏడు పశువులు మృతి

ఆర్మూర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మామిడిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు ఏడు పాడి పశువులు మృతి చెందాయి. వీటిలో మూడు పశువులు నిండు చూలుతో ఉండి కొన్ని రోజుల్లో ఈనే పశువులు. కాగా రెండు పశువులు ఇటీవలే ఈని పాలు ఇస్తున్న పశువులు. మిగిలిన రెండు పశువులు మేలు జాతి పెయ్యలు. పాడి పశువులు మృతి చెందడంతో పాడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు నాలుగు లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని ఆర్మూర్‌ పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్‌ లక్కంపల్లి ...

Read More »

చెత్త బుట్టల కోసం లక్ష విరాళం

బీర్కూర్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలంలోని బరంగెడిగి గ్రామంలో మాజీ జెడ్పిటిసి ద్రోణ పల్లి సతీష్‌ ఆదివారం చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అశోక్‌ తన సొంత డబ్బు లక్ష రూపాయలు వెచ్చించి బరంగెడిగి గ్రామానికి ఎనిమిది వందల చెత్తబుట్టలు తెప్పించారు. ఈ సందర్భంగా సతీష్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలోని ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్‌ నిషేధించి స్వచ్ఛత గ్రామం వైపు అడుగులు వేయాలన్నారు. ప్రతి ...

Read More »

ప్రతి వ్యక్తిని దేశభక్తిని కలిగి ఉండాలి

రెంజల్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రజలందరు దేశభక్తిని కలిగి ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ విభాగ్‌ కార్యవాహ గణేశ్‌ బలవత్రి అన్నారు. మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక శిక్షావర్గ సమారోప్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రధాన వక్తంగా విచ్చేసిన గణేశ్‌ మాట్లాడుతూ గ్రామాల్లో దళితుల పట్ల వివక్ష చూపరాదని, దీనిని రూపుమాపేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తివంచన లేకుండా ముందుకు పోతుందన్నారు. అంబేడ్కర్‌ అందరివాడని, కొందరివాడు కాదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించింది ...

Read More »

ప్రణాళిక పనులపై మండలంలో గ్రామసభలు

రెంజల్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం గత నెల రోజుల నుండి 30 రోజుల ప్రణాళిక పనులు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా శనివారం మండలంలోని రెంజల్‌, నీలా, దూపల్లి, వీరన్నగుట్ట, తాడ్‌బిలోలి, బోర్గాం, కల్యాపూర్‌, కూనేపల్లి తదితర గ్రామాల్లో స్థానిక సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ఎజెండా ప్రకారం నిర్వహించిన ప్రణాళిక పనులను సభలో వివరించారు. మిగిలిన పనులుంటే సిబ్బంది దృష్టికి తేవాలని సభ్యులు కోరారు. పనులు సక్రమంగా నిర్వహించి గుర్తింపు పొందిన శానిటేషన్‌ కమిటీ సభ్యులను ...

Read More »

ప్రభుత్వం మెడలు వంచాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌టీసీ కార్మికులపట్ల నిర్లక్షం వహిస్తున్న ప్రభుత్వం మెడలు వంచాలని, కార్మికుల న్యాయమైన కోరికలను వెంటనే పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. శనివారం జరిగిన నిరసన కార్యక్రమంలో కార్మికులను ఉద్దేశించి ప్రసంగిచారు. ఆర్‌టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, ప్రభుత్వం సంస్థకు చెల్లించవలసిన రెండు వేల కోట్లు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సిబ్బందికి ఉద్యగభద్రత కల్పించాలని, ప్రభుత్వానికి వ్యతిరేకముగా నినాదాలు చేసారు. కార్యక్రమంలో సీడీసీ ...

Read More »

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల జీతాలు ఇవ్వాలని నిరవధిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఆసుపత్రి ముందు గంట పాటు ధర్నా చేసి, భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు (ఏఐటియుసి) ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్‌, దోమకొండ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ...

Read More »

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మె నేపద్యంలో కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో ప్రజలకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాలు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు శనివారం రాత్రి జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసు, రవాణా, ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా రవాణా ...

Read More »

కార్మికుల సమ్మెకు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ మద్దతు

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరవధిక సమ్మెకు టిఎన్‌ఎస్‌ఎఫ్‌ పూర్తి మద్దతును తెలియజేస్తుందని రాష్ట్ర కార్యదర్శి బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల న్యాయబద్ధమైన కోరికలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం నెరవేర్చనందుకే కార్మికులు సమ్మెకు వెళ్లడం జరిగిందని, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న ఏడు వేల ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తున్నామంటే తాత్కాలిక కార్మికులతో విధులను నిర్వహించడం సిగ్గుచేటన్నారు. ట్రస్మ ...

Read More »

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఆర్టీసీ సంస్థ రక్షణ కోసం, సంస్థను ప్రభుత్వం విలీనం చేసుకోవాలని, గత 30 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ అమలు చేయాలని కోరుతూ శుక్రవారం అర్ధరాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కార్మికులను ఉద్దేశించి ఎంసిపిఐయూ జిల్లా కార్యదర్శి రాజలింగం మాట్లాడారు. మున్సిపల్‌ కార్యాలయం ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆర్టీసీ ఉద్యోగ కార్మికులతో సమ్మెకు మద్దతుగా మాట్లాడుతూ ...

Read More »

ప్రణాళికలో పాలుపంచుకున్న అందరికి కృతజ్ఞతలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లెల సమగ్రాభివ ద్ధికి 30 రోజుల గ్రామపంచాయతీ ప్రత్యేక ప్రణాళిక ఎంతగానో దోహదపడిందని ప్రజల భాగస్వామ్యంతో ప్రజా ప్రతినిధులు అధికారులు కషితో కార్యక్రమం విజయవంతమైందని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు తెలిపారు. జిల్లాలో సెప్టెంబర్‌ ఆరవ తేదీ నుండి అక్టోబర్‌ 5వ తేదీ వరకు నిర్వహించిన 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో ఆశించిన ఫలితాలు వచ్చాయని ముఖ్యంగా ప్రణాళికలో అందరు తమ గ్రామాభివద్ధికి ముందుకు వచ్చి ముఖ్యంగా గ్రామాలను పరిశుభ్రంగా పచ్చదనంగా ఉండాలనే ...

Read More »

అమ్మవారికి పల్లకీసేవ

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో హన్మాన్‌ మందిరంవద్ద శ్రీ యువజన దుర్గాభవాని మండలి వారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం దుర్గామాత మండపం నుండి వీధుల గుండా దుర్గామాత పల్లకీ సేవ ఏర్పాటు చేశారు. గురుస్వామి సాయగౌడ్‌, పంతులు నందు శర్మ ఆధ్వర్యంలో పల్లకి సేవ నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీ యువజన దుర్గ భవానీ యువకులు, భవానీ స్వాములు, మాత స్వాములు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More »

స్వదేశానికి స్పీకర్‌

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారిక విదేశీ పర్యటన ముగించుకున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. అధికారిక పర్యటనలో భాగంగా స్పీకర్‌ ఉగాండా దేశ రాజధాని కంపాల నగరంలో జరిగిన 64 వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు సెప్టెంబర్‌ 25న హైదరాబాద్‌ నుండి బయలుదేరి వెళ్ళారు. అనంతరం యూరప్‌లో పర్యటించి లండన్‌ నుండి శనివారం ఉదయం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. స్వదేశానికి విచ్చేసిన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి విమానాశ్రయంలో ...

Read More »

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ యూత్‌, నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా బ్లాక్‌ లెవల్‌ క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. ఎన్‌వైకె ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ బేలాల్‌ శైలి, నసురుల్లాబాద్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ సందీప్‌ పోటీలు ప్రారంభించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కోఆర్డినేటర్‌ శైలి మాట్లాడుతూ యువతి యువకులు అధిక సంఖ్యలో టోర్నమెంట్‌లో పాల్గొనాలని, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఆటలపై ఆసక్తిని పెంచడమే పోటీల ఉద్దేశమన్నారు. ...

Read More »

ప్రణాళిక ముగిసింది

నందిపేట్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రణాళిక పనుల ముగింపు కార్యక్రమలు ఆర్భాటంగా జరిగాయి. గాదేపల్లి గ్రామ పంచాయతీ లో 30 రోజుల ప్రణాళికలో భాగంగా శనివారం సఫాయి కార్మికులను, అంగన్‌వాడీ టీచర్లను, వర్కర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ నక్కల భూమేష్‌ మాట్లాడుతూ గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడం కోసం ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందన్నారు. గ్రామాలు అభివద్ధి చేయడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. సిహెచ్‌ కొండూరు గ్రామంలో సర్పంచ్‌ ప్రభాకర్‌, ఎంపిటిసి ...

Read More »

అందరి సహకారంతోనే విజయవంతమైంది

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల రూపురేఖలు మారిపోతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాసనసభ వ్యవహారాలు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ మండలంలోని చిట్టాపూర్‌ గ్రామంలో గ్రామపంచాయతీ 30 రోజుల ప్రత్యేక కార్యచరణ ప్రణాళికలో భాగంగా ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడారు. పచ్చదనం పరిశుభ్రతగా గ్రామాలు ఉండాలనే ఉద్దేశంతోనే 30 రోజుల ప్రణాళికలు రూపొందించినట్లు, ప్రణాళిక ద్వారా పల్లెల రూపురేఖలు మారే అవకాశముందన్నారు. అందుకు రాష్ట్ర ...

Read More »