Breaking News

మహిళల ఐకమత్యానికి ప్రతీక బతుకమ్మ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలందరూ ఒకచోట చేరి సంతోషంగా జరుపుకునే ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అని జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు అన్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ మైదానంలో జిల్లాస్థాయి సద్దుల బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సంబరాలకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, స్థానిక శాసనసభ్యులు బిగాల గణేష్‌ గుప్తా, ఎమ్మెల్సీ వి.జి. గౌడ్‌తో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్‌ సతీమణితో కలిసి బతుకమ్మ పూజ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి దార్శనికతతో అందరికీ సమ ప్రాధాన్యతనిస్తూ అందరి పండుగలను అధికారికంగా నిర్వహించటానికి ఆదేశాలు జారీ చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు బతుకమ్మ పండుగ అంటే కొంత వివక్ష ఉండేదని, కానీ తెలంగాణ సాధన అనంతరం బతుకమ్మ పండుగకు పూర్వవైభవం తీసుకొచ్చి ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తూ ఆడబిడ్డలకు గౌరవం తీసుకు వచ్చారన్నారు.

ఎంతోమంది కషితో బతుకమ్మ పండుగకు జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించిందని, ప్రపంచ దేశాల్లో తెలంగాణ వారు పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. బతుకమ్మ అంటే పూలు, ప్రకతి పండుగ, శక్తిస్వరూపిణి మరో రూపమని తెలిపారు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలను మంచి నాణ్యతతో పలు రకాలుగా తయారుచేసి మహిళలకు అందించడం జరిగిందన్నారు.

గత నెల రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక మంచి ఫలితాలను ఇచ్చిందని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు మార్పు కనిపిస్తోందని పచ్చదనం మరోవైపు ఆకర్షిస్తుందని, పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగిందన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా మారాయన్నారు. ఇందుకు కారణమైన ప్రజా ప్రతినిధులు, ప్రజలు, అధికారులకు కతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించి కాలుష్యం నుండి సమాజానికి నష్టాన్ని తగ్గించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు మాట్లాడుతూ బతుకమ్మ అంటే మన కార్యక్రమమని ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని మన తెలంగాణ కట్టుబొట్టు, సాంప్రదాయం బతుకమ్మ అని అన్నారు. ఐకమత్యంతో మహిళలందరూ జరుపుకునే పండుగ అని తెలిపారు.

బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో నుడా చైర్మన్‌ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, సమాచార శాఖ ఉపసంచాలకులు ముర్తుజా అలి, మెప్మా పిడి రాములు, నగర మాజీ మేయర్‌ ఆకుల సుజాత, జిల్లా సంక్షేమ అధికారిణి స్రవంతి, జిల్లా అధికారులు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగునాడు విద్యార్థి సమాఖ్య టిఎన్‌ఎస్‌ఎఫ్‌, తెలంగాణ జన సమితి ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *