Breaking News

మోకాళ్లపై కూర్చొని నిరసన

కామారెడ్డి, అక్టోబర్‌ 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల జీతాలు ఇవ్వాలని ఆసుపత్రి ముందు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. రెండోరోజు ఆదివారం ఆసుపత్రి ముందు ధర్నా అనంతరం మోకాళ్ళపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు (ఏఐటియుసి) ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్‌, దోమకొండ, ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

అలాగే దీనిపై జిల్లా అధికారుల స్పందన కూడ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్‌, ప్రభుత్వం బడ్జెట్‌ లేదని చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే జిల్లా అధికారులు కలెక్టర్‌ ప్రభుత్వానికి విషయం వివరించి కార్మికులకు జీతాలు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో కార్మికులు ఫజియా, స్వరూప, దయాకర్‌, లక్ష్మి, వజ్రమ్మ, మమత, దేవరాజు శ్రీను, రాజేశ్వర్‌, పాతిమ, గణేశ్‌, నర్సమ్మ తదితరులు ఉన్నారు.

Check Also

కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించుమని ప్రార్థన

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష ...

Comment on the article