Breaking News

ప్రతి వ్యక్తిని దేశభక్తిని కలిగి ఉండాలి

రెంజల్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ ప్రజలందరు దేశభక్తిని కలిగి ఉండాలని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ విభాగ్‌ కార్యవాహ గణేశ్‌ బలవత్రి అన్నారు. మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ప్రాథమిక శిక్షావర్గ సమారోప్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ప్రధాన వక్తంగా విచ్చేసిన గణేశ్‌ మాట్లాడుతూ గ్రామాల్లో దళితుల పట్ల వివక్ష చూపరాదని, దీనిని రూపుమాపేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తివంచన లేకుండా ముందుకు పోతుందన్నారు. అంబేడ్కర్‌ అందరివాడని, కొందరివాడు కాదని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించింది అంబేడ్కర్‌ అని గుర్తుచేశారు.

ప్రపంచంలోని చాలా దేశాలు భగవద్గీతను అనుసరిస్తున్నాయని, దాని ప్రత్యేకతను తెలుసుకుంటున్నాయనే విషయాన్ని మరిచిపోరాదన్నారు. 1925లో డాక్టర్‌ హెడ్గేవార్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించి ధర్మాన్ని జాగృతం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు.

అంతకుముందు గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఘోష్‌ వాయిద్యాలు, భగవాధ్వజంతో పథసంచలన్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపిపి లోలపు రజిని, సర్పంచ్‌ రమేశ్‌ కుమార్‌, బీరం కృష్ణారెడ్డి, రాజు, కిషోర్‌, గోపాల్‌రెడ్డి, పోచయ్య, గంగాధర్‌ తదితరులున్నారు. త

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *