Breaking News

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ యూత్‌, నెహ్రు యువ కేంద్రం ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా బ్లాక్‌ లెవల్‌ క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. ఎన్‌వైకె ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ బేలాల్‌ శైలి, నసురుల్లాబాద్‌ సబ్‌ ఇన్స్‌పెక్టర్‌ సందీప్‌ పోటీలు ప్రారంభించారు.

ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కోఆర్డినేటర్‌ శైలి మాట్లాడుతూ యువతి యువకులు అధిక సంఖ్యలో టోర్నమెంట్‌లో పాల్గొనాలని, గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు ఆటలపై ఆసక్తిని పెంచడమే పోటీల ఉద్దేశమన్నారు. ఫిట్‌ ఇండియాగా తయారు చేయడమే తమ ఎన్‌వైకె ప్రధాన లక్ష్యమన్నారు. బ్లాక్‌ లెవల్‌ పోటీలో మంచి ప్రతిభ కనబర్చిన వారికి ఖేలో ఇండియాలో అవకాశం కల్పిస్తామన్నారు.

ఎస్‌ఐ సందీప్‌ మాట్లాడుతూ దసరా సెలవుల్లో యువత చేడుదోవ పడకుండా ఇలాంటి ఆటలు ఆడడంవల్ల మంచి స్నేహాభావం పెరిగి కొత్త పరిచయాలు ఏర్పడతాయన్నారు. ఆటలు ఆడడం వల్ల వారిలో మానసిక స్థాయి పెరిగి ఎలాంటి ఒత్తిడిలనైనా తట్టుకొని నిలబడతారన్నారు. క్రీడా పోటీల్లో బాన్సువాడ, నసురుల్లాబాద్‌, బీర్కూర్‌ మండలాల నుంచి అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ లక్ష్మి విట్ఠల్‌, ఎన్‌వైకె వాలంటీర్‌ సునీల్‌ రాథోడ్‌, సేవా సంఘ్‌ యూత్‌ రాహుల్‌, లాల్‌ సింగ్‌, నవీన్‌, మహేందర్‌, శ్రీను, చిరంజీవి, అశోక్‌, విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటాంటామని కామారెడ్డి జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *