Breaking News

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల జీతాలు ఇవ్వాలని నిరవధిక సమ్మె చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం ఆసుపత్రి ముందు గంట పాటు ధర్నా చేసి, భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు (ఏఐటియుసి) ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ ఎల్లారెడ్డి, బాన్సువాడ, మద్నూర్‌, దోమకొండ ఆసుపత్రి కార్మికులకు గత రెండు నెలల నుండి జీతాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అలాగే దీనిపై జిల్లా అధికారుల స్పందన కోరితే కలెక్టర్‌ కూడా దీనిపై స్పందించక పోవడం బాధాకరమన్నారు. కాంట్రాక్టర్‌, ప్రభుత్వం బడ్జెట్‌ లేదని చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వెంటనే జిల్లా అధికారులు కలెక్టర్‌ ప్రభుత్వానికి తెలియచేసి కార్మికులకు జీతాలు వచేలా చేయాలన్నారు.

కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాలరాజు, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ ప్రవీణ్‌, హాస్పిటల్‌ కార్మికులు ఫజియా, రఫిక్‌, దయాకర్‌, లక్ష్మీ, గంగాధర్‌, సునీత, బైరమ్మ, వజ్రమ్మ, విజయ, మమత, పద్మ, వీరేందర్‌, దేవరాజు, శ్రీను, నవీన్‌, రాజేశ్వర్‌, నర్సమ్మ తదితరులు ఉన్నారు.

Check Also

చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలియో ఆదివారం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *