Breaking News

ప్రణాళిక పనులపై మండలంలో గ్రామసభలు

రెంజల్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం గత నెల రోజుల నుండి 30 రోజుల ప్రణాళిక పనులు నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా శనివారం మండలంలోని రెంజల్‌, నీలా, దూపల్లి, వీరన్నగుట్ట, తాడ్‌బిలోలి, బోర్గాం, కల్యాపూర్‌, కూనేపల్లి తదితర గ్రామాల్లో స్థానిక సర్పంచ్‌ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు.

ఎజెండా ప్రకారం నిర్వహించిన ప్రణాళిక పనులను సభలో వివరించారు. మిగిలిన పనులుంటే సిబ్బంది దృష్టికి తేవాలని సభ్యులు కోరారు. పనులు సక్రమంగా నిర్వహించి గుర్తింపు పొందిన శానిటేషన్‌ కమిటీ సభ్యులను సన్మానించారు.

బోర్గాం గ్రామంలో ఎంపిడివో గోపాలకృష్ణను సన్మానించారు. సభలో సర్పంచ్‌లు రమేశ్‌ కుమార్‌, ఖలీంబేగ్‌, వికార్‌ పాషా, సాయిలు, సాయారెడ్డి, విజయ, నిరంజని, శ్రీదేవి, జమున, రాజు, గణేశ్‌, వాణి తదితరులున్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *