Breaking News

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్టీసీ సమ్మె నేపద్యంలో కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో ప్రజలకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాలు గహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు శనివారం రాత్రి జిల్లా కలెక్టర్‌తో పాటు పోలీసు, రవాణా, ఆర్టీసీ, రెవెన్యూ అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముందస్తు ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యాలు కల్పించాలని, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో అద్దె బస్సులతో పాటు, ప్రైవేట్‌ బస్సులను, స్కూల్‌ బస్సులు ఏర్పాటుచేసి ఎలాంటి అసౌకర్యం ఇబ్బందులు కలగకుండా ప్రయాణీకులు గమ్యానికి చేరే విధంగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శనివారం 71 శాతం బస్సులను నడిచినట్లు చెప్పారు.

ఇంకా అవసరమైతే పక్క రాష్ట్రాల నుండి ప్రవేట్‌ బస్సులను తెప్పించాలని అధికారులను ఆదేశించారు. డిపోల వద్ద పోలీస్‌ శాఖ బందోబస్తు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రెవెన్యూ, రవాణా ఆర్టీసీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఏర్పాట్లు చేయాలని, అంతేకాకుండా రూట్లలో వెళ్లే బస్సులను ఎలాంటి నష్టం జరగకుండ ఉమ్మడి జిల్లాలో సుమారు 60 మొబైల్‌ పోలీస్‌ బందాలను ఏర్పాటు చేసినట్టు ఉమ్మడి జిల్లాలో 182 బస్సులు, 700 స్కూల్‌ బస్సులతో పాటు, ప్రైవేట్‌ వాహనాలను నడిపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసినట్లు చెప్పారు.

ఉమ్మడి జిల్లాలో సుమారు పన్నెండు వందల మంది కండక్టర్లను, 427 డ్రైవర్లను, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి చెప్పారు. ఆర్టీసీ యజమానికి ఉమ్మడి జిల్లాలో ఏమైనా ఇబ్బందులు సమస్య ఎదురైనప్పుడు సంబంధిత జిల్లా కలెక్టర్‌లను సంప్రదించి సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు కోరారు. జిల్లా కలెక్టర్‌ రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారంగా జిల్లాలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లపై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు రవాణా, పోలీస్‌, ఆర్టీసీ, రెవెన్యూ శాఖను అప్రమత్తం చేసినట్లు జిల్లాలో ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో సమిష్టి కషితో పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మె నేపద్యంలో జిల్లాలో చేపట్టిన ముందస్తు ప్రత్యేక చర్యలు మంత్రికి జిల్లా కలెక్టర్‌ వివరించారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పి శ్రీధర్‌ రెడ్డి, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్‌ శివలింగయ్య, నిజామాబాద్‌ ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు, ఆర్‌ఎమ్‌ ఆర్‌టిసి తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *